Telugu Global
Cinema & Entertainment

శ్రీదేవి బాటలో జ్యోతిక

రీఎంట్రీలో అదరగొట్టేసింది జ్యోతిక. అతిలోకసుందరి శ్రీదేవి తరహాలోనే లేడీ ఓరియంటెడ్ మూవీని ఎంచుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లిష్-వింగ్లిష్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో శ్రీదేవి ఘన విజయాన్నందుకుంటే.. జ్యోతిక కూడా 36-వయదనిళ్లే అనే లేడీఓరియంటెడ్ సినిమాతో రీఎంట్రీలో హిట్ కొట్టింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం తమిళనాట 9కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత జ్యోతిక చేసిన సినిమా ఇది. మధ్యలో భర్త సూర్యతో కలిసి యాడ్స్ చేసినప్పటికీ.. […]

శ్రీదేవి బాటలో జ్యోతిక
X
రీఎంట్రీలో అదరగొట్టేసింది జ్యోతిక. అతిలోకసుందరి శ్రీదేవి తరహాలోనే లేడీ ఓరియంటెడ్ మూవీని ఎంచుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లిష్-వింగ్లిష్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో శ్రీదేవి ఘన విజయాన్నందుకుంటే.. జ్యోతిక కూడా 36-వయదనిళ్లే అనే లేడీఓరియంటెడ్ సినిమాతో రీఎంట్రీలో హిట్ కొట్టింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం తమిళనాట 9కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత జ్యోతిక చేసిన సినిమా ఇది. మధ్యలో భర్త సూర్యతో కలిసి యాడ్స్ చేసినప్పటికీ.. సిల్వర్ స్క్రీన్ పైకి రావడం మాత్రం ఇదే తొలిసారి. రోషన్ ఆండ్రూ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సూర్యానే నిర్మాత. తన భార్య కోసం 2డీ ఎంటర్ టైన్ మెంట్ అనే బ్యానర్ పెట్టి మరీ సూర్య ఈ సినిమాను నిర్మించారు. పేరుకు సూర్య నిర్మాతే అయినప్పటికీ.. ఈ సినిమా పర్యవేక్షణ బాధ్యత కూడా జ్యోతికకే అప్పగించాడు సూర్య. అలా అన్ని విభాగాల్లో రాణించి సూపర్ హిట్ అందుకుంది జ్యోతిక. సో.. ఇక నుంచి రీఎంట్రీలో హిట్ కొట్టాలంటే ఏ హీరోయిన్ అయినా లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని ఎంచుకోవాలేమో..
First Published:  22 May 2015 8:58 PM GMT
Next Story