Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సరసన బాలీవుడ్ హాటీ

బాహుబలి షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్ వచ్చే నెల నుంచి మరో కొత్త సినిమా ప్రారంభించాలనుకుంటున్నాడు. సుజిత్ డైరక్షన్ లో ఓ సినిమా చేసేందుకు ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకొచ్చింది. మూవీలో ప్రభాస్ సరసన అలియా భట్ ను హీరోయిన్ గా ప్రయత్నిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ హాట్ సెన్సేషన్ గా పేరుతెచ్చుకున్న అలియా భట్ ను ప్రభాస్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం […]

ప్రభాస్ సరసన బాలీవుడ్ హాటీ
X
బాహుబలి షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్ వచ్చే నెల నుంచి మరో కొత్త సినిమా ప్రారంభించాలనుకుంటున్నాడు. సుజిత్ డైరక్షన్ లో ఓ సినిమా చేసేందుకు ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకొచ్చింది. మూవీలో ప్రభాస్ సరసన అలియా భట్ ను హీరోయిన్ గా ప్రయత్నిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ హాట్ సెన్సేషన్ గా పేరుతెచ్చుకున్న అలియా భట్ ను ప్రభాస్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అలియా భట్ అయితే తనకు కూడా ఓకే అని ప్రభాస్ కూడా చెప్పేశాడట. ప్రస్తుతం ఆమెకు కథ వినిపించే పనిలో ఉన్నారు. అటు అలియా భట్ కూడా ప్రభాస్ సరసన నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఒప్పుకుంటే.. అలియాకు భారీగా ముట్టజెప్పేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అలియా ఒప్పుకోకపోతే.. మరో బాలీవుడ్ భామను ట్రైచేసే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్.
First Published:  23 May 2015 12:23 AM GMT
Next Story