Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ పోస్టర్ రిలీజైంది

బాహుబలి సినిమాకు సంబంధించి పోస్టర్ల ప్రమోషన్ లో భాగంగా చిట్టచివరిదైన ప్రభాస్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. రణరంగంలో బాహుబలి గెటప్ లో వీరోచితంగా యుద్ధం చేస్తున్న ప్రభాస్ పోస్టర్ కు విడుదలైన వెంటనే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం పోస్టర్ విడుదల చేయడమే కాకుండా… సినిమాకు సంబంధించి ఓ మంచి క్లూ కూడా వదిలాడు దర్శకుడు రాజమౌళి. రాజు కాదు.. కానీ రాజ్యం గుండెల్లో నిలిచాడు అని చెప్పుకొచ్చాడు. మొట్టమొదట విడుదల చేసిన […]

ప్రభాస్ పోస్టర్ రిలీజైంది
X
బాహుబలి సినిమాకు సంబంధించి పోస్టర్ల ప్రమోషన్ లో భాగంగా చిట్టచివరిదైన ప్రభాస్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. రణరంగంలో బాహుబలి గెటప్ లో వీరోచితంగా యుద్ధం చేస్తున్న ప్రభాస్ పోస్టర్ కు విడుదలైన వెంటనే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం పోస్టర్ విడుదల చేయడమే కాకుండా… సినిమాకు సంబంధించి ఓ మంచి క్లూ కూడా వదిలాడు దర్శకుడు రాజమౌళి. రాజు కాదు.. కానీ రాజ్యం గుండెల్లో నిలిచాడు అని చెప్పుకొచ్చాడు. మొట్టమొదట విడుదల చేసిన పోస్టర్ ను, తాజా ట్వీట్ ను కలిపి చూసుకుంటే.. సినిమా స్టోరీని కాస్త అర్థం చేసుకోవచ్చు.

మొదటి పోస్టర్ లో సముద్రంలో ఓ మహిళ, ఓ పసికందును ఎత్తుకునే స్టిల్ ఉంది. ఇక తాజా ట్వీట్ లో రాజు కాదు.. అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఈ రెండూ కలిపి చూస్తే.. ఆ పసికందే పెద్దయ్యాక బాహుబలి అయ్యాడని ఊహించుకోవచ్చు. అయితే రానా, అనుష్క పాత్రలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రభాస్ గెటప్ తో పోస్టర్ల ప్రచారం ముగిసింది. ఈనెలాఖరుకు అంటే మే 31కు ఆడియో రిలీజ్ ఉంటుంది. అదే రోజు కుదిరితే ట్రయిలర్ ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. జులైలో బాహుబలి పార్ట్-1ను థియేటర్లలోకి తీసుకొస్తారు.

First Published:  23 May 2015 12:09 AM GMT
Next Story