Telugu Global
Others

రాజ‌ధాని ఉద్యోగులంద‌రికీ ప్ర‌భుత్వ గృహాలు!

నవ్యాంధ్ర రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర నివాసానికి రంగం సిద్ధమవుతోంది. రాజధానికి తరలి వచ్చేందుకు తమకు వసతులు లేవని చెబుతున్న ఉద్యోగులకు అటు ఉద్యోగ సంఘాల నేతలు, ఇటు ప్రభుత్వం కలిపి ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. సుమారు 10 నుంచి 15 వేల గృహాలను ఉద్యోగుల కోసం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం హడ్కోను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా, ఉద్యోగులకు నష్టం కలగ కుండా ఉభయతారకంగా ఉండే విధంగా ఈ […]

రాజ‌ధాని ఉద్యోగులంద‌రికీ ప్ర‌భుత్వ గృహాలు!
X
నవ్యాంధ్ర రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర నివాసానికి రంగం సిద్ధమవుతోంది. రాజధానికి తరలి వచ్చేందుకు తమకు వసతులు లేవని చెబుతున్న ఉద్యోగులకు అటు ఉద్యోగ సంఘాల నేతలు, ఇటు ప్రభుత్వం కలిపి ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. సుమారు 10 నుంచి 15 వేల గృహాలను ఉద్యోగుల కోసం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం హడ్కోను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా, ఉద్యోగులకు నష్టం కలగ కుండా ఉభయతారకంగా ఉండే విధంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని ఉద్యోగులకు ప్ర‌భుత్వానికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా దీన్ని రూపొందించారు. ఈ పథకం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా దీనిని పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని విజయవాడలోని సీఆర్‌డీఏ అధికారులకు పంపారు. రాజధాని తుళ్లూరు ప్రాంతంలోనే ఉద్యో గులకు గృహవసతి కల్పించాలనేది ఈ పథకంలో ప్రధానాంశం. రాజధాని పరిధిలో ఇందుకోసం 250 నుంచి 300 ఎకరాల వరకు కేటాయించనున్నారు. ఇందులో ఉద్యోగుల కోసం 10 నుంచి 15 వేల ఇళ్లను హడ్కో సాయంతో నిర్మించనున్నారు. రాజధానిలో తొలిదశలో మొత్తం 20 వేల మంది వరకు ఉద్యోగులు ఉంటారని భావిస్తున్నారు. అందులో గుంటూరు, విజయవాడలోను, పరిసర ప్రాంతాల్లో ఉండే వారిని మినహాయిస్తే సుమారు 10 వేల నుంచి 13 వేల మంది వరకు రాజధాని ప్రాంతంలో ఉంటారని అంచనా వేశారు. హడ్కో ఆర్థిక సాయంతో నిర్మించే ఈ గృహాలను ఉద్యోగులకు కేటాయిస్తారు. ప‌ద‌వీ విరమణ చేసే వరకు ఉద్యోగులు ఈ గృహాల్లో ఉంటారు. ఆ తరువాత ఖాళీ చేస్తే కొత్తవారికి కేటాయిస్తారు. చివరకు ఈ గృహాలన్నీ ప్రభుత్వ ఆస్తులుగా మారిపోతాయి.
First Published:  23 May 2015 3:28 AM GMT
Next Story