Telugu Global
Cinema & Entertainment

మంచు లక్ష్మి ఇక ఆగదట..   

కొన్ని సినిమాలు తీసి భారీగ నష్టపోయిన మంచు లక్ష్మి’కి  రీసెంట్ గా తీసిన ‘దొంగాట’ సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఈ సినిమా వల్ల కొంత లాభాలు వచ్చాయని సమాచారం. ఇంతకు ముందు సినిమాల వలే ఖర్చు విషయంలో తొందర పడకుండా చాలా జాగ్రత్తగా దొంగాట సినిమాను నిర్మించింది మంచు లక్ష్మి. ఇక సన్నిహితులను ఈ సినిమాలో గెస్ట్ అప్పీల్ చేయించడంతో సినిమాకు పెద్ద ప్రమోషన్స్  లాగా కూడా ఉపయోగపడ్డాయి, ఏది ఏమైనా చాలా కాలం తర్వాత సినిమా […]

మంచు లక్ష్మి ఇక ఆగదట..   
X
కొన్ని సినిమాలు తీసి భారీగ నష్టపోయిన మంచు లక్ష్మి’కి రీసెంట్ గా తీసిన ‘దొంగాట’ సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఈ సినిమా వల్ల కొంత లాభాలు వచ్చాయని సమాచారం. ఇంతకు ముందు సినిమాల వలే ఖర్చు విషయంలో తొందర పడకుండా చాలా జాగ్రత్తగా దొంగాట సినిమాను నిర్మించింది మంచు లక్ష్మి. ఇక సన్నిహితులను ఈ సినిమాలో గెస్ట్ అప్పీల్ చేయించడంతో సినిమాకు పెద్ద ప్రమోషన్స్ లాగా కూడా ఉపయోగపడ్డాయి, ఏది ఏమైనా చాలా కాలం తర్వాత సినిమా పరంగా మంచు లక్ష్మి ఈ సినిమా ద్వారానే ఎక్కువ సంతోషంగా ఉందని అందరు చెప్పుకుంటున్నారు.
ఇక ఈ మధ్యనే రెండో తమ్ముడు మంచు మనోజ్ పెళ్లి కూడా ఘనంగా జరిగింది. ఈ పెళ్ళిలో హడావిడి అంతా మంచు లక్ష్మి దే. దొంగాట సినిమా లాభాలు రావడం, అలాగే తమ్ముడు పెళ్లి తో మస్త్ ఖుషీ అయిన మంచు లక్ష్మి ఇక పైన ఫాస్ట్ గా సినిమాలు తీయాలని నిర్ణయించుకుంది అట.
First Published:  23 May 2015 12:52 AM GMT
Next Story