Telugu Global
NEWS

కాపురాలు కూల్చే కంత్రీ బాబా!

‘కూటి కోసం కోటి విద్యలు’ ఈ సామెతను వినే ఉంటారుగా! ఇత‌గాడికి విద్య అబ్బినట్టు లేదు. అందుకే 17 ఏళ్లకే స్వామీజీ అవతారం ఎత్తాడు. పైగా ఇతడి తల్లిదండ్రులు కూడా ‘‘మా అబ్బాయికి అమ్మవారు ఓళ్లోకి వస్తారు’’ అని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంకేముంది మనోడు చెలరేగి పోయాడు. తాను చెప్పేదే వేదం అనుకున్నాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళతో ‘‘నువ్వు 3 నెలల గర్భవతివి. నీకు మగ పిల్లాడు పుడతాడు. ఆ అబ్బాయికి […]

కాపురాలు కూల్చే కంత్రీ బాబా!
X
‘కూటి కోసం కోటి విద్యలు’ ఈ సామెతను వినే ఉంటారుగా! ఇత‌గాడికి విద్య అబ్బినట్టు లేదు. అందుకే 17 ఏళ్లకే స్వామీజీ అవతారం ఎత్తాడు. పైగా ఇతడి తల్లిదండ్రులు కూడా ‘‘మా అబ్బాయికి అమ్మవారు ఓళ్లోకి వస్తారు’’ అని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంకేముంది మనోడు చెలరేగి పోయాడు. తాను చెప్పేదే వేదం అనుకున్నాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళతో ‘‘నువ్వు 3 నెలల గర్భవతివి. నీకు మగ పిల్లాడు పుడతాడు. ఆ అబ్బాయికి నాపేరు పెట్టుకో.’’ అని సెల‌విచ్చాడు. గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం, చెరుకుపల్లికి చెందిన రామారావు కుటుంబం రెండు సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం నరసరావుపేటలోని శ్రీనివాస్‌నగర్‌కు వలస వచ్చారు. కొడుక్కి చదువు అబ్బక పోయేసరికి ఇటుకల బట్టీలో పనికి పెట్టారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డం ఇష్టంలేని అత‌గాడు తల్లిదండ్రుల సాయంతో స్వామీజీగా పరిచయం చేసుకున్నాడు. మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సౌమ్య అనే మహిళ పిల్లలు పుట్టక పోవడంతో రామారావు దగ్గరకు వచ్చింది. నీ భ‌ర్త‌ని పంపించు… అని ఆమెతో అన్నాడు. సౌమ్య తన భర్తను స్వామీజీ వద్దకు పంపించింది. రామారావు ఆమెపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పాడు. దీంతో రామారావు చెప్పింది నిజమని నమ్మి సౌమ్యకు విడాకులివ్వడానికి సౌమ్య‌ భర్త సిద్దపడ్డాడు. ఈ విషయాన్ని సౌమ్య తన కుటుంబ సభ్యలకు తెలియజేసింది. విషయం విన్న సౌమ్య పిన్ని మన స్వామీజీ రామారావు దగ్గరకు వెళ్లింది. ఆమె కూడా తనకు పిల్లలు పుట్టడం లేదని చెప్పింది. ‘‘నువ్వు 3 నెలల గర్భవతివి. నీకు మగ పిల్లాడు పుడతాడు. ఆ అబ్బాయికి నాపేరు పెట్టుకో.’’ అని ఆమెతో రామారావుస్వామి చెప్పాడు. కానీ అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. పైగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఆరు సంవత్సరాలు అయింది. దీంతో రామారావు బండారం బయటపడింది. అతడు స్వామీజీ కాదని, డబ్బు కోసం అబద్దాలు చెబుతూ కాపురాలు కూలుస్తున్నాడని సౌమ్య బంధువులు ఆరోపించారు. స్థానికులకు విషయం తెలియడంతో రామారావుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
First Published:  22 May 2015 10:29 PM GMT
Next Story