Telugu Global
Others

పేకాట ఆడుతున్న 13 మంది మహిళల అరెస్టు

అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో పేకాట ఆడుతున్న 13 మంది మహిళలను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి రూ.84 వేల నగదు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని వైష్ణవీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో గత కొద్ది రోజులుగా 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలు పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం సదరు ఫ్లాట్‌పై దాడి చేసి 13 మంది మహిళలను […]

అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో పేకాట ఆడుతున్న 13 మంది మహిళలను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి రూ.84 వేల నగదు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని వైష్ణవీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో గత కొద్ది రోజులుగా 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలు పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం సదరు ఫ్లాట్‌పై దాడి చేసి 13 మంది మహిళలను అరెస్టు చేశారు. ఈ మేరకు చైతన్యపురి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  23 May 2015 1:05 AM GMT
Next Story