Telugu Global
Others

ఎండల ధాటికి పిట్టల్లా రాలుతున్న జనం... మృతులు 700

తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మండుతున్నాయి. అగ్ని పర్వతంలా నిప్పులు చిమ్ముతున్నాయి. ఉదయిస్తూనే భానుడు… ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బయటికి రావాలంటేనే… జనం బెంబేలెత్తుతున్నారు. ఎండలధాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఉక్కపోత‌, బ‌య‌ట వ‌డ‌గాలులు… ఈ ధాటికి పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు ప్రాణాలు కోల్పోతున్నారు. వాయువ్య దిశ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి […]

ఎండల ధాటికి పిట్టల్లా రాలుతున్న జనం... మృతులు 700
X

తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మండుతున్నాయి. అగ్ని పర్వతంలా నిప్పులు చిమ్ముతున్నాయి. ఉదయిస్తూనే భానుడు… ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బయటికి రావాలంటేనే… జనం బెంబేలెత్తుతున్నారు. ఎండలధాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఉక్కపోత‌, బ‌య‌ట వ‌డ‌గాలులు… ఈ ధాటికి పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు ప్రాణాలు కోల్పోతున్నారు. వాయువ్య దిశ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు ఎక్కువ నమోదువుతన్నాయి. పగటి వేళల్లో రోడ్డుపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. అడుగు బయటపెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. రాత్రిళ్లలోనూ విపరీతమైన వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. గ‌త నాలుగు రోజుల్లో రెండు రాష్ట్రాల్లోను 700 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఒక్కరోజే 50 మంది చ‌నిపోయారు. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. డీజీపీ కూడా పోలీసు స్టేష‌న్ల వ‌ద్ద చ‌లివేంద్రాలు నిర్వ‌హించాల‌ని కోరారు. విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల వ‌ద్ద ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ఎక్క‌డ పేలిపోతాయోన‌న్న భ‌యంతో కూల‌ర్లు పెట్టి చ‌ల్ల‌బ‌రుస్తున్నారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత…
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలహాబాద్‌ 47 డిగ్రీలు, జైసల్మీర్‌లో 46.5, వారణాసి- 45.6, ఢిల్లీ-45.3,అహ్మదాబాద్‌-43, గోరఖ్‌పూర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలదెబ్బకు… పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి నిర్మానుష్యంగా మారింది. భక్తుల రాక విపరీతంగా తగ్గిపోయింది. గంగానది తీరంలోని ఘాట్‌లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అలహాబాద్‌లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాలుల ధాటికి జనం బెంబేలెత్తుతున్నారు. సూర్యతాపానికి తాళలేక మాస్కులు, కర్చీఫ్‌లు ధరిస్తూ ముసుగుదొంగల్లా తిరుగుతున్నారు. ఎండల ధాటికి వడోదరలోని జూలో జంతువులు అల్లాడుతున్నాయి. అధికారులు బోను లోపలా, పైకప్పులపైనా చల్లని నీటితో తడుపుతున్నారు. వడదెబ్బకు దేశవ్యాప్తంగా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మరో మూడు రోజులూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

First Published:  24 May 2015 10:50 AM GMT
Next Story