Telugu Global
Others

కొంచెం ఇష్టం... కొంచెం క‌ష్టం

నరేంద్ర మోడీ ఏడాది పాలన ‘బాగుంది’ అని జనం అభిప్రాయపడ్డారు. అయితే… బీజేపీ చెప్పుకుంటున్నంతగా ‘అచ్ఛే దిన్‌’ (మంచి రోజులు) రాలేదన్నారు. మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఇండియాటుడే-సిసిరో’ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికలనాటితో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు స్వల్పంగా పెరిగిందని తేలింది. ఈ సర్వేలో 7652 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 56 శాతం మోడీ పాలన బాగుందన్నారు. ద్రవ్యోల్బణం అదుపు, ధరలకు కళ్లెం, విదేశాంగ విధానం, స్వచ్ఛభారత్‌, […]

కొంచెం ఇష్టం... కొంచెం క‌ష్టం
X
నరేంద్ర మోడీ ఏడాది పాలన ‘బాగుంది’ అని జనం అభిప్రాయపడ్డారు. అయితే… బీజేపీ చెప్పుకుంటున్నంతగా ‘అచ్ఛే దిన్‌’ (మంచి రోజులు) రాలేదన్నారు. మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఇండియాటుడే-సిసిరో’ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికలనాటితో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు స్వల్పంగా పెరిగిందని తేలింది. ఈ సర్వేలో 7652 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 56 శాతం మోడీ పాలన బాగుందన్నారు. ద్రవ్యోల్బణం అదుపు, ధరలకు కళ్లెం, విదేశాంగ విధానం, స్వచ్ఛభారత్‌, అవినీతి నియంత్రణ… మోడీ విజయాలుగా అభివర్ణించారు. ముఖ్యంగా… ‘స్వచ్ఛభారత్‌’కు జేజేలు పలికారు. ‘ఈ కార్యక్రమం వల్ల మా పరిసరాలు బాగుపడ్డాయి’ అని 57శాతం తెలిపారు. పేదలందరికీ బ్యాంకు ఖాతా ‘జన్‌ధన్‌ యోజన’కూ భారీ ప్రశంసలు లభించాయి. మరోవైపు… ‘మోడీ మా అంచనాలకు తగినట్లు పనిచేయడం లేదు’ అని 46 శాతం తెలిపారు. ‘ప్రస్తుత నేతల్లో ఎవరు బెస్ట్‌’ అనే ప్రశ్నకు 2014 ఆగస్టునాటి సర్వేలో 57శాతం మోడీకి జేజేలు కొట్టినా ఇప్పుడు 33 శాతానికి పడిపోవడం గమనార్హం. మోడీ హయాంలో మైనారిటీలపై దాడులు జరగడం లేదని 51 శాతం సంతృప్తి వ్య‌క్తం చేశారు. ‘మంచి రోజులు వచ్చాయా?’ అన్న ప్రశ్నకు 53శాతం ‘అబ్బే… అలాంటిదేమీ లేదు’ అని పెదవి విరిచారు. ‘మేం సోషల్‌ మీడియాలో మోడీని ఫాలో కావడం లేదు’ అని 72 శాతం తెలిపారు. చివరగా… ప్రధాని పదవికి మోడీయే తగిన వ్యక్తి అని నిర్ద్వంద్వంగా తేల్చారు. 11 శాతమే ‘రాహుల్‌ అయితే బాగుంటుంది’ అన్నారు.
First Published:  23 May 2015 9:45 PM GMT
Next Story