Telugu Global
Others

అమరావతిలో పెట్టుబ‌డుల‌కు సింగ‌పూర్ రెడీ

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతి నగర నిర్మాణానికి రూ. 70 వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు సింగ‌పూర్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం పదేళ్ల వ్యవధిలో రాజధానికి సంబంధించిన భవనాలు, మౌలిక వసతులు, ఐటీ పార్కులు, పర్యాటక, వినోద కేంద్రాల నిర్మాణంపై ఈ పెట్టుబడి పెట్టాలని ఆ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆహ్వానానికి స్పందనగా సింగపూర్‌ ప్రభుత్వం తన బిడ్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. […]

అమరావతిలో పెట్టుబ‌డుల‌కు సింగ‌పూర్ రెడీ
X
ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతి నగర నిర్మాణానికి రూ. 70 వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు సింగ‌పూర్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం పదేళ్ల వ్యవధిలో రాజధానికి సంబంధించిన భవనాలు, మౌలిక వసతులు, ఐటీ పార్కులు, పర్యాటక, వినోద కేంద్రాల నిర్మాణంపై ఈ పెట్టుబడి పెట్టాలని ఆ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆహ్వానానికి స్పందనగా సింగపూర్‌ ప్రభుత్వం తన బిడ్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణానికి ఎంపికయ్యే మాస్టర్‌ డెవలపర్‌ నిధుల సేకరణ బాధ్యత కూడా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధన విధించింది. దానికి అంగీకరిస్తూ సింగపూర్‌ తన బిడ్‌ దాఖలు చేసింది. దీనిపై ఉభయ ప్రభుత్వాల అధికార వర్గాల మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో తాము ఎంత పెట్టుబడి పెట్టదల్చుకున్నామన్నది సింగపూర్‌ అధికారులు సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. సరాసరిన ఏడాదికి రూ. 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకూ రాజధాని నిర్మాణంపై వెచ్చించడానికి సింగపూర్‌ సిద్ధంగా ఉంది. రాజధాని నిర్మాణం ఒకేసారి జరగదు. ముందుగా మౌలిక వసతులను అభివృద్ధి చేశాక…. ఆ తర్వాతనే భవనాల నిర్మాణం చేపడతారు. దీనికి సమాంతరంగా చుట్టూ రహదారులు, నీటి సరఫరా వంటి ఇతర వసతుల నిర్మాణం జరుగుతుంది.

మొత్తం పదేళ్లపాటు క్రమంగా వీటిని అభివృద్ధి చేసుకొంటూ వెళ్తే ప్రపంచస్ధాయి ప్రమాణాలతో రాజధాని నగరాన్ని తీర్చిదిద్దడం వీలు పడుతుందన్నది సింగపూర్‌ నిపుణుల అంచనా. తాము పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఆ ప్రాంతంపై వచ్చే ఆదాయం నుంచే తీసుకొంటామని, ప్రభుత్వం తన ఖజానా నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా సింగపూర్‌ నిపుణులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులకు సూచించారు. ‘అంత ఆదాయం వచ్చే స్ధాయిలో రాజధాని నిర్మాణం చేస్తాం. తీర్చిదిద్దుతాం. ఆ రిస్క్‌ తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీకు టెన్షన్‌ అవసరం లేదు’ అని వారు భరోసా ఇచ్చినట్లు సమాచారం. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రంలో ఇతర దేశాలు ఈ స్థాయిలో పెట్టుబడులు ఏనాడూ పెట్టలేదు. ఆర్థికంగా ఇటువంటి అవకాశం దొరక్కే గాంధీనగర్‌, నయా రాయపూర్‌ వంటి కొత్త రాజధానులు పెద్దగా గుర్తింపు పొందలేకపోయాయి. ఇపుడు సింగ‌పూర్ గ‌నుక పెట్టుబ‌డులు పెడితే రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆర్థిక భారం చాలామేర త‌గ్గిపోతుంది. దీనివ‌ల్ల ఇత‌ర అభివృద్ధి రంగాల‌పై దృష్టి కేంద్రీక‌రించ‌డానికి ఆస్కార‌మేర్ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు.
First Published:  23 May 2015 10:55 PM GMT
Next Story