Telugu Global
NEWS

ప్ర‌పంచం గ‌ర్వించే విధంగా ఏపీ రాజ‌ధాని: చ‌ంద్ర‌బాబు

ప్ర‌పంచం గ‌ర్వించేట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని నిర్మాణం ఉంటుంద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు తెలిపారు. సోమ‌వారం ఆయ‌న సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ నుంచి రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను అందుకున్నారు. కోటీ ప‌ది ల‌క్ష‌ల మంది జ‌నాభా అవ‌స‌రాలు తీర్చే విధంగా ఈ రాజ‌ధాని ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. జూన్ ఆరున శంకుస్థాప‌న చేసే రాజ‌ధాని నిర్మాణం ప‌నులు విజ‌య ద‌శ‌మి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆయ‌న చెప్పారు. అమ‌రావ‌తిని డైన‌మిక్ సిటీగా రూపొందిస్తామ‌ని, ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా […]

ప్ర‌పంచం గ‌ర్వించే విధంగా ఏపీ రాజ‌ధాని: చ‌ంద్ర‌బాబు
X

ప్ర‌పంచం గ‌ర్వించేట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని నిర్మాణం ఉంటుంద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు తెలిపారు. సోమ‌వారం ఆయ‌న సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ నుంచి రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను అందుకున్నారు. కోటీ ప‌ది ల‌క్ష‌ల మంది జ‌నాభా అవ‌స‌రాలు తీర్చే విధంగా ఈ రాజ‌ధాని ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. జూన్ ఆరున శంకుస్థాప‌న చేసే రాజ‌ధాని నిర్మాణం ప‌నులు విజ‌య ద‌శ‌మి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆయ‌న చెప్పారు. అమ‌రావ‌తిని డైన‌మిక్ సిటీగా రూపొందిస్తామ‌ని, ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండేట్లు చూస్తామ‌ని ఆయ‌న తెలిపారు. అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధానిగా ఉంటుంద‌న్నారు. ఆర్థిక వ‌న‌రుల క‌ల్ప‌న‌గా ఈ రాజ‌ధాని ఉండాల‌ని భావిస్తున్నామ‌ని, రాజ‌ధాని ర‌హ‌దారుల‌న్నీ ప్ర‌పంచ స్థాయికి ధీటుగా ఉంటాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. తాము ఆశించిన స్థాయిలో సింగ‌పూర్ నిపుణులు ప్లాన్ త‌యారు చేశార‌ని, అందులో పెద్ద మార్పులేమీ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలిపారు.
ఈ మాస్ట‌ర్ ప్లాన్‌లో విశేషాల‌ను సుర్భానా ఇంట‌ర్నేష‌న‌ల్ సీఈఓ వివ‌రించారు. ఈ ప్లాన్ వాస్తుకు త‌గ్గ‌ట్టుగా ఉంటుంద‌ని, కృష్ణాతీరంలో దీన్ని నిర్మించ‌డం కూడా రాజ‌ధానికి మంచి చేకూరుస్తుంద‌ని అన్నారు. ఈ ప్లాన్ ప్ర‌కారం 135 కిలోమీట‌ర్ల మెట్రో రైల్ రాజ‌ధాని ప్రాంతంలో ఉంటుంద‌ని, 110 కిలోమీట‌ర్ల ఎక్స్‌ప్రెస్ హైవేలు, సెమీ ఎక్స్‌ప్రెస్ వేలు ఇందులో భాగంగా ఉంటాయ‌ని ఆయన వివ‌రించారు. రాజ‌ధాని ప‌రిధిలో 35 కిలోమీట‌ర్ల జ‌ల ర‌వాణా కూడా ఉంటుంద‌న్నారు. సిటీ ప‌రిధిలో సెంట్ర‌ల్ పార్కు, స్టేడియం, యూనివ‌ర్శిటీ ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు.
అంత‌కుముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సింగపూర్‌ బృందం అందజేసింది. సోమ‌వారం ఆయ‌న‌ను క‌లిసిన సంద‌ర్భంగా మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్‌ బృందం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఇచ్చింది. మాస్టర్‌ప్లాన్‌లో పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. తాగునీరు, విద్యుత్‌, రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య, నివాసేతర భవనాలు, పార్కులు, వినోద కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించిన‌ట్లు తెలిసింది. సమావేశం అనంతరం సింగపూర్‌ బృందానికి చంద్రబాబు త‌న నివాస గృహంలో విండు ఏర్పాటు చేశారు.

First Published:  25 May 2015 7:18 AM GMT
Next Story