Telugu Global
Cinema & Entertainment

ఆయ‌న‌తో చేస్తే  జీవిత చ‌క్రం పూర్తి అవుతుంది..! 

భార‌త దేశం నుంచి నాణ్య‌మైన మోడ‌ల్స్ లో  అంత‌ర్జాతీయ ఖ్యాతి వున్న  వారిలో  ఐశ్వ‌ర్య రాయ్ ఒక‌రు.  విశ్వ‌సుంద‌రిగా ఆమె ప్ర‌స్థానం  ప్ర‌యాణం  ఎంద‌రికి ప్రేర‌ణ అయ్యింది.  సినిమాల‌కు త‌న విశ్వ సుంద‌రి  కిరిటాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.  కెరీర్ ప్రారంభంలో   కొద్ది పాటి త‌డ‌బాడు ఫేస్ చేసిన ఐశ్వర్య ..ద‌క్షిణాది  ద‌ర్శ‌క దిగ్గ‌జాలు  శంక‌ర్, మ‌ణిర‌త్నం తీర్చి దిద్దారు.  మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్ లో చేసిన  ‘ఇద్ద‌రు’ చిత్రం  ఐశ్వ‌ర్య లో భిన్న‌మైన కోణాల్ని […]

ఆయ‌న‌తో చేస్తే  జీవిత చ‌క్రం పూర్తి అవుతుంది..! 
X
భార‌త దేశం నుంచి నాణ్య‌మైన మోడ‌ల్స్ లో అంత‌ర్జాతీయ ఖ్యాతి వున్న వారిలో ఐశ్వ‌ర్య రాయ్ ఒక‌రు. విశ్వ‌సుంద‌రిగా ఆమె ప్ర‌స్థానం ప్ర‌యాణం ఎంద‌రికి ప్రేర‌ణ అయ్యింది. సినిమాల‌కు త‌న విశ్వ సుంద‌రి కిరిటాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో కొద్ది పాటి త‌డ‌బాడు ఫేస్ చేసిన ఐశ్వర్య ..ద‌క్షిణాది ద‌ర్శ‌క దిగ్గ‌జాలు శంక‌ర్, మ‌ణిర‌త్నం తీర్చి దిద్దారు. మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్ లో చేసిన ‘ఇద్ద‌రు’ చిత్రం ఐశ్వ‌ర్య లో భిన్న‌మైన కోణాల్ని ప్రేక్ష‌కలోకానికి ప‌రిచ‌యం చేసింది. ఆ త‌రువాత క‌థా బ‌లం వున్న చిత్రాల‌తో న‌టిగా త‌న స‌త్తాను చాటుకుంది. ఇక ‘ధూమ్ 2’ వంటి సీక్వెల్స్ లో గ్లామ‌ర్ హీరోయిన్ గా మెప్పించింది.
ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ వంటి హాలీవుడ్ చిత్రంలో న‌టించి భార‌తదేశ ఖ్యాతిని ఘ‌నంగా బ‌య‌టి ప్ర‌పంచానికి చాటింది. ఇక అభిషేక్ బ‌చ్చ‌న్ తో పెళ్లి… ఈ మ‌ధ్య త‌ల్లి కావ‌డం.. రీసెంట్ ‘జ‌బ్బా’ పేరు తో గ్రాండ్ రీ ఎంట్రి చేస్తుండ‌టం జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్ లో ముచ్చ‌ట‌గా నాలుగోసారి న‌టించ‌డానికి ఐశ్వ‌ర్య సిద్దం అయ్యింది. అయితే ఈ సారి మ‌ణి ర‌త్నం చేయ‌బోయో చిత్రం సింగిల్ స్టార్ కాద‌ని వినిపిస్తుంది. నాగార్జున‌, మ‌హేష్ బాబు, శృతి హాస‌న్, ఐశ్వ‌ర్య రాయ్ ఇలా భారీ తారాగ‌ణంతో చేయ‌బోతున్న‌ట్లు టాక్. ‘ఇద్ద‌రు’ తో మ‌ణి స్టార్ డైరెక్ష‌న్ లో చేసిన ఐశ్వ‌ర్య.. ఆ త‌రువాత‌..గురు, రావ‌న్ చిత్రాలు చేశారు. మ‌రోసారి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో చేస్తే త‌న జీవిత చ‌క్రం పూర్తి అవుతుంద‌ని ఐష్ వ్యాఖ్య‌నించారంటే ఎంత ఆస‌క్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవ‌చ్చు క‌దా.

First Published:  26 May 2015 6:43 AM GMT
Next Story