వేదిక ఖరారు చేసిన బాహుబలి

బాహుబలి ఆడియో వేడుకకు సంబంధించి వేదిక ఖరారైంది. హైదరాబాద్ హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ లో బాహుబలి ఆడియోను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ పనులు ప్రారంభమైపోయాయి. బాహుబలి ఆడియో వేడుకకు నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఫంక్షన్ కు తెలుగు సినీరంగానికి చెందిన అతిరథ మహారధుల్ని ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నాడు రాజమౌళి. అటు తన సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంటూనే మ్యూజిక్ డైరక్టర్ కీరవాణికి షాకిచ్చాడు రాజమౌళి. జక్కన్న ఎప్పుడు సినిమా తీసినా ఆ ఆడియో రైట్స్ ను వేల్ రికార్డ్స్ అనే సంస్థకే ఇస్తాడు. ఈ ఆడియో సంస్థ కీరవాణిదే. కానీ బాహుబలి ఆడియో రైట్స్ విషయంలో కీరవాణిని పక్కనపెట్టాడు. దాదాపు కోటి 50లక్షల రూపాయలకు లహరి సంస్థకు బాహుబలి ఆడియో రైట్స్ కట్టబెట్టాడు. ఈసారి రాజమౌళి ఎందుకిలా చేశాడనే విషయం ఎవరికీ అంతుచిక్కలేదు. బహుశా.. బాహుబలి సినిమాకు సంబంధించి ఆడియో రైట్స్ తో కలిపి ముందుగానే ప్యాకేజీ మాట్లాడుకోలేదేమో..