Telugu Global
Cinema & Entertainment

మా డబ్బు..మా సినిమా ..మా ఇష్టం

 ఏ సినిమాకు అయిన ఫ‌స్ట్  హీరో నిర్మాతే అని చెప్పాలి.  అలాగే   ఎంతో ఖ‌ర్చు పెట్టి చేసిన సినిమా అడియ‌న్స్ కు రీచ్ కావాలంటే ప‌బ్లిసిటి అవ‌స‌రం.  ఈ విష‌యంలో  మొన్న‌టి వ‌ర‌కు   ఛానెల్స్ అన్నింటికి  నిర్మాత‌లు  మార్కెటింగ్  ఇవ్వ‌డం  చేస్తూ వ‌చ్చారు. క‌ట్ చేస్తే ఈ మ‌ధ్య  నిర్మాత దిల్ రాజ్  డైరెక్ష‌న్ లో ఒక సిండికేట్  బ‌య‌లు దేరి .. కేవ‌లం టాప్ రేటింగ్ వున్న  రెండు ఛాన‌ల్స్ కు మాత్రమే మార్కెటింగ్ ఇస్తామ‌ని..మిగిలిన […]

మా డబ్బు..మా సినిమా ..మా ఇష్టం
X

ఏ సినిమాకు అయిన ఫ‌స్ట్ హీరో నిర్మాతే అని చెప్పాలి. అలాగే ఎంతో ఖ‌ర్చు పెట్టి చేసిన సినిమా అడియ‌న్స్ కు రీచ్ కావాలంటే ప‌బ్లిసిటి అవ‌స‌రం. ఈ విష‌యంలో మొన్న‌టి వ‌ర‌కు ఛానెల్స్ అన్నింటికి నిర్మాత‌లు మార్కెటింగ్ ఇవ్వ‌డం చేస్తూ వ‌చ్చారు. క‌ట్ చేస్తే ఈ మ‌ధ్య నిర్మాత దిల్ రాజ్ డైరెక్ష‌న్ లో ఒక సిండికేట్ బ‌య‌లు దేరి .. కేవ‌లం టాప్ రేటింగ్ వున్న రెండు ఛాన‌ల్స్ కు మాత్రమే మార్కెటింగ్ ఇస్తామ‌ని..మిగిలిన వాటికి ఇవ్వ‌డం లేద‌ని తేల్చారు. ఈ విష‌యంలో అటు దిల్ రాజ్ అండ్ కో కు..ఇటు ఇత‌ర మీడియా ఛానెల్స్ వారికి ఒక ఫైట్ న‌డుస్తుంది. ఈ నేప‌థ్యంలో దిల్ రాజ్ కు సంబంధించిన ఏ సినిమాకు ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌ని మిగిలిన ఛానెల్స్ అన్ని భిష్మించుకున్నాయి. దిల్ రాజ్ పంపిణి చేసిన దోచేయ్, ఓకే బంగారం చిత్రాల్ని దూరంగా పెట్టారు. దోచేయ్ సినిమా ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఓకే బంగారం కేవ‌లం మ‌ల్టీ ప్లేక్స్ లో కొద్ది రోజులు న‌డిచింది. ప్ర‌చారం వుంటే ఈ రెండు చిత్రాల ఆదాయం మ‌రింత బెట‌ర్ గా ఉండేది అన‌డంలో సందేహామే లేదు.

ఎంత జ‌రిగినా.. దిల్ రాజ్ అండ్ కో.. ఈ విష‌యంలో వాళ్లు ప‌ట్టిన ప‌ట్టు విడ‌వడం లేదు. ఆయ‌న‌తో పాటు వున్న మ‌రికోంద‌రు బిగ్ ప్రొడ్యూస‌ర్స్ కూడా ఇదే త‌ర‌హాలో వున్నారు. ఇక శుక్ర‌వారం రిలీజ్ కు సిద్ద‌మైన పండ‌గ చేస్కో, రాక్ష‌సుడు చిత్రాల విష‌యంలో కూడా దిల్ రాజ్ అండ్ టీమ్ వాళ్ల అనుకున్న‌ట్లు గానే కేవ‌లం రెండు ఛానెల్స్ కే మార్కెటింగ్ ఇవ్వ‌డానికే నిర్ణ‌యించార‌ట‌. దీంతో మిగిలిన ఛానెల్స్ గ‌తంలో మాదిరే ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన‌ది ఏది క‌వ‌ర్ చేయ‌కూడద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు టాక్. మొత్తం మీద కొద్ది మంది ప్రొడ్యూస‌ర్స్ దెబ్బ‌కి హీరోలు షేక్ అవుతున్నారు మ‌రి. ఎక్క‌డైన మంది ఎక్కువైతే మ‌జ్జిగ ప‌ల‌చ‌నవుతుంది అంటే ఇదేనేమో క‌దా.!

First Published:  26 May 2015 2:48 AM GMT
Next Story