Telugu Global
NEWS

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇంటిదొంగ‌ల ప‌ట్టివేత‌

నిన్న‌కాక మొన్న ఎనిమిది కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు క‌స్ట‌మ్స్ అధికారుల‌కు మంగ‌ళ‌వారం మ‌రో ఎనిమిది కేజీల బంగారం ప‌ట్టుబ‌డింది. మొన్న వ‌చ్చిన బంగార‌మూ దుబాయ్ నుంచే… ఇపుడు కూడా అక్క‌డి నుంచే. దుబాయ్ నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికుడు ఒక‌రు ఈ బంగారాన్ని తీసుకువ‌చ్చాడు. ఇది ప‌సిగ‌ట్టిన అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడ్ని ప్ర‌శ్నించారు. అత‌ను చెప్పిన వివ‌రాలు విన్నాక అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్న కొంత‌మంది […]

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇంటిదొంగ‌ల ప‌ట్టివేత‌
X
నిన్న‌కాక మొన్న ఎనిమిది కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు క‌స్ట‌మ్స్ అధికారుల‌కు మంగ‌ళ‌వారం మ‌రో ఎనిమిది కేజీల బంగారం ప‌ట్టుబ‌డింది. మొన్న వ‌చ్చిన బంగార‌మూ దుబాయ్ నుంచే… ఇపుడు కూడా అక్క‌డి నుంచే. దుబాయ్ నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికుడు ఒక‌రు ఈ బంగారాన్ని తీసుకువ‌చ్చాడు. ఇది ప‌సిగ‌ట్టిన అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడ్ని ప్ర‌శ్నించారు. అత‌ను చెప్పిన వివ‌రాలు విన్నాక అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్న కొంత‌మంది ఉద్యోగుల స‌హకారంతోనే తాము బంగారాన్ని తీసుకువ‌స్తున్నామ‌ని స‌ద‌రు నిందితుడు చెప్పాడు. స‌హ‌కారం అందిస్తున్న‌ది ఎవ‌రో చెప్ప‌మ‌ని బ‌ల‌వంతంగా చేయ‌గా మొత్తం మీద నిందితుడు పేర్ల‌ను బ‌య‌ట పెట్టాడు. ఈ ఉద్యోగుల్లో ఒక‌రు భాస్క‌ర‌రెడ్డి కాగా మ‌రొక‌రు రాంనాయుడు. వీరికి డీల్‌కు స‌హ‌కరించినందుకు ట్రిప్‌కు ఇర‌వై ల‌క్ష‌లు ముట్ట‌జెబుతామ‌ని అత‌ను చెప్పాడు. వెంట‌నే వీరిద్ద‌రినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించిన అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో రెండు కోట్ల రూపాయ‌లుంటుంద‌ని అధికారులు చెప్పారు.
First Published:  26 May 2015 3:40 AM GMT
Next Story