Telugu Global
Others

జూన్‌ 7న పారిశ్రామిక విధానం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని జూన్ 7వ తేదీన ప్రకటించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, బహుళ జాతి కంపెనీల ప్రతినిధుల సమక్షంలో ఈ విధానాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. పారిశ్రామిక విధానానికి తుది రూపు ఇచ్చేందుకుగాను అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం కోసం కసరత్తు చేసి తుది రూపం తీసుకువచ్చిన అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు.  ప్రభుత్వం ఏర్పాటైన […]

జూన్‌ 7న పారిశ్రామిక విధానం: కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని జూన్ 7వ తేదీన ప్రకటించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, బహుళ జాతి కంపెనీల ప్రతినిధుల సమక్షంలో ఈ విధానాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. పారిశ్రామిక విధానానికి తుది రూపు ఇచ్చేందుకుగాను అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం కోసం కసరత్తు చేసి తుది రూపం తీసుకువచ్చిన అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నూతన పారిశ్రామిక విధాన రూపకల్పన కోసం పలువురితో చర్చించటమే కాకుండా అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తున్న దేశాల్లో పరిస్థితిని అధ్యయనం చేసినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
First Published:  26 May 2015 12:18 PM GMT
Next Story