Telugu Global
Cinema & Entertainment

పాత టైటిల్ తో కొత్తగా హిట్ కొడతాడా..

నాని తాజా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు భలే భలే మగాడివోయ్ అనే పేరును ఇప్పటికే ఖరారు చేశారు. తాజాగా ఈ టైటిల్ తో నాని, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూర్చున్న ఓ కూల్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మారుతి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ […]

పాత టైటిల్ తో కొత్తగా హిట్ కొడతాడా..
X
నాని తాజా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు భలే భలే మగాడివోయ్ అనే పేరును ఇప్పటికే ఖరారు చేశారు. తాజాగా ఈ టైటిల్ తో నాని, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూర్చున్న ఓ కూల్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మారుతి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు నాని. ఎందుకంటే ఈమధ్య కాలంలో సరైన హిట్ కొట్టలేకపోతున్నాడు.

తాజాగా వచ్చిన ఎవడే సుబ్రమణ్యం సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ పాజిటివ్ టాక్ వసూళ్ల రూపంలో మారలేకపోయింది. అలా కమర్షియల్ హీరో అనే ఇమేజ్ కు కొన్నేళ్లుగా దూరమయ్యాడు నాని. ఇంకా చెప్పాలంటే ఈగ తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. అందుకే ఈసారి తనదైన స్టయిల్ లో ఎలాంటి ప్రయోగాలకు పోకుండా మారుతి డైరక్షన్ లో కూల్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా మన ఈగ హీరో హిట్ కొట్టాలని ఆశిద్దాం

First Published:  26 May 2015 1:08 AM GMT
Next Story