Telugu Global
NEWS

విటులు లైంగిక దోపిడీదారులే!

రేప్ చేస్తే జైలు శిక్ష వేస్తారు గానీ..వ్య‌భిచారం చేస్తే ఏమ‌వుతుంది?  దొరికితే ఫైన్ క‌ట్టి బ‌య‌టికి రావ‌చ్చు క‌దా! అని ధీమాగా ఉండేవిటులకు హెచ్చ‌రిక‌.. అన్నీ తెలిసి వ్య‌భిచారం చేయ‌డానికి వెళ్లిన విటుడికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డుతుంది. విటుల‌పై కూడా 370 ఏ కేసు పెట్ట‌వ‌చ్చ‌ని హైకోర్టు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అన్నీ తెలిసి వ్య‌భిచారం చేసే విటులూ లైంగిక‌దోపిడీ దారులేన‌ని స్ప‌ష్టంచేసింది. బ‌ల‌వంతంగా వ్య‌భిచారం చేస్తున్న మైన‌ర్లు, మ‌హిళలతో […]

రేప్ చేస్తే జైలు శిక్ష వేస్తారు గానీ..వ్య‌భిచారం చేస్తే ఏమ‌వుతుంది? దొరికితే ఫైన్ క‌ట్టి బ‌య‌టికి రావ‌చ్చు క‌దా! అని ధీమాగా ఉండేవిటులకు హెచ్చ‌రిక‌.. అన్నీ తెలిసి వ్య‌భిచారం చేయ‌డానికి వెళ్లిన విటుడికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డుతుంది. విటుల‌పై కూడా 370 ఏ కేసు పెట్ట‌వ‌చ్చ‌ని హైకోర్టు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అన్నీ తెలిసి వ్య‌భిచారం చేసే విటులూ లైంగిక‌దోపిడీ దారులేన‌ని స్ప‌ష్టంచేసింది. బ‌ల‌వంతంగా వ్య‌భిచారం చేస్తున్న మైన‌ర్లు, మ‌హిళలతో వ్య‌భిచారం చేస్తే అది లైంగికదాడి కిందే ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని తెలిపింది. వారిని జ‌రిమానాతో వ‌దిలి పెట్ట‌కుండా ఇక‌పై 370ఏ కేసు న‌మోదు చేయ‌వ‌చ్చని వ్య‌భిచారానికి ప‌ట్టుబ‌డిన ఓ యువ‌కుడు దాఖ‌లు చేసిన కేసులో హైకోర్టు ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది.
First Published:  25 May 2015 1:05 PM GMT
Next Story