న‌ల్ల‌కుబేరుల తాజా జాబితా..!

కొన్నేళ్లుగా దేశంలో హాట్‌టాపిక్‌గా మారిన న‌ల్ల‌ధ‌నం కేసులో మ‌రో బుల్లి అడుగుప‌డింది. తాజాగా  40 మంది వివ‌రాల‌తో కూడిన జాబితాను  స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) ద్వారా విడుద‌ల చేశారు. ఇందులో బ్రిట‌న్‌, ర‌ష్యా, స్పెయిన్ దేశాల వ్య‌క్తుల‌తోపాటు  స్నేహలత సాహ్ని, సంగీత సాహ్ని.. అనే ఇద్దరు భార‌తీయ మహిళల పేర్లు ఉన్నాయి. వీరి పుట్టిన తేదీ మినహా, మరే వివరాలను స్విట్జర్లాండ్ వెల్లడించలేదు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన వారి ఇనిషియెల్స్ మాత్రమే వెల్లండించింది. అయితే వారి వివరాలను భారత ప్రభుత్వానికి వెల్లడించకూడదనుకుంటే, 30 రోజుల్లోగా ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్  కోర్టుకు వీరు అప్పీల్ చేసుకోవచ్చని ఎఫ్‌టీఏ తెలిపింది.  కొంత‌కాలంగా న‌ల్ల‌కుబేరుల జాబితా వెల్ల‌డించాల‌ని స్విట్జ‌ర్లాండ్‌పై భార‌త్ ఒత్తిడి చేస్తున్న విష‌యం తెలిసిందే