Telugu Global
Cinema & Entertainment

ఆర్య-3కు రంగం సిద్ధమౌతోందా..

బన్నీ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఆర్య. గంగోత్రి హిట్టయినప్పటికీ, బన్నీని ఫుల్ లెంగ్త్ హీరోగా, మరీ ముఖ్యంగా కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆర్య-2 చేశారు. ఆర్య రేంజ్ లో హిట్ కాకపోయినప్పటికీ.. ఆర్య-2 కూడా టేకింగ్ పరంగా బెస్ట్ అనిపించుకుంది. సినిమాకి మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆర్య-3పై కన్నేసింది ఈ […]

ఆర్య-3కు రంగం సిద్ధమౌతోందా..
X
బన్నీ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఆర్య. గంగోత్రి హిట్టయినప్పటికీ, బన్నీని ఫుల్ లెంగ్త్ హీరోగా, మరీ ముఖ్యంగా కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆర్య-2 చేశారు. ఆర్య రేంజ్ లో హిట్ కాకపోయినప్పటికీ.. ఆర్య-2 కూడా టేకింగ్ పరంగా బెస్ట్ అనిపించుకుంది. సినిమాకి మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆర్య-3పై కన్నేసింది ఈ ద్వయం. కుదిరితే ఆర్య-3ని పట్టాలపైకి తీసుకొద్దామని చాలా రోజుల కిందటే అనుకున్నారు బన్నీ-సుకుమార్. ఈమధ్యే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి స్టోరీలైన్ ను బన్నీకి వినిపించాడట సుకుమార్. చేద్దామని బన్నీ హామీ ఇచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం సుకుమార్, ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. మరో వారం రోజుల్లో ఈ మూవీ ప్రారంభమౌతుంది. అటు బన్నీ కూడా బోయపాటితో ఓ సినిమాకు కమిటయ్యాడు. ఇది కూడా ఈమధ్యే ప్రారంభమైంది. సో.. ఈరెండు సినిమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వస్తుంది.
First Published:  27 May 2015 12:30 AM GMT
Next Story