Telugu Global
NEWS

వ‌డ‌దెబ్బ‌కు ఒక్క‌రోజే 450 మంది మృతి!

వేసవి వేడి తగ్గుముఖం పట్టినా, వడగాలులు, ఉక్కపోతతో ఇరు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు.ఒక్క మంగ‌ళ‌వార‌మే ఆంధ్రప్రదేశ్‌లో 290 మంది, తెలంగాణలో 160 మంది వడదెబ్బతో మృతి చెందారు. ముఖ్యంగా ఏపీలోని కోస్తా తీరం సూరీడు ప్రతాపానికి ఉడికిపోయింది. ఎండవేడికి తోడు వాయువ్య దిశ నుంచి తీవ్ర వడగాలులు వీయడంతో జనం విలవిల్లాడారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత‌, వడగాలుల ప్రభావం అధికంగా ఉంది. ఉత్తర కోస్తాలో ఉదయం కొద్దిసేపు ఆకాశం మేఘావృతమైనా మధ్యాహ్నం సమయానికి ఎండ […]

వ‌డ‌దెబ్బ‌కు ఒక్క‌రోజే 450 మంది మృతి!
X
వేసవి వేడి తగ్గుముఖం పట్టినా, వడగాలులు, ఉక్కపోతతో ఇరు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు.ఒక్క మంగ‌ళ‌వార‌మే ఆంధ్రప్రదేశ్‌లో 290 మంది, తెలంగాణలో 160 మంది వడదెబ్బతో మృతి చెందారు. ముఖ్యంగా ఏపీలోని కోస్తా తీరం సూరీడు ప్రతాపానికి ఉడికిపోయింది. ఎండవేడికి తోడు వాయువ్య దిశ నుంచి తీవ్ర వడగాలులు వీయడంతో జనం విలవిల్లాడారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత‌, వడగాలుల ప్రభావం అధికంగా ఉంది. ఉత్తర కోస్తాలో ఉదయం కొద్దిసేపు ఆకాశం మేఘావృతమైనా మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఇరు రాష్ట్రాల్లో మంగళవారం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో సాధారణం కంటే 8 డిగ్రీలు మేర అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గన్నవరం, బాపట్ల, మచిలీపట్నంలలో 46 డిగ్రీలు నమోదు కాగా ఒంగోలులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నిజామాబాద్‌లో 44, హైదరాబాద్‌లో 43 డిగ్రీలు నమోదైంది. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌లో 290 మంది, తెలంగాణలో 160 మంది మృతి చెందారు. ఏపీ, తెలంగాణల్లో బుధవారమూ అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల తాకిడి కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ కోస్తా ప్రాంతంలోని విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
First Published:  26 May 2015 9:54 PM GMT
Next Story