Telugu Global
NEWS

రాజధాని ప్రాంతంలో అటవీ భూముల లిస్ట్ రెడీ

కృష్ణాజిల్లాలో పరిశ్రమలు, ఇతర రాజధాని అవసరాలకు భారీ భూ బ్యాంక్ ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని 64451.88 హెక్టార్ల అటవీ భూముల్లో 39 వేల ఎకరాల భూములను రాజధాని అవసరాలకు వినియోగించుకోవచ్చని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ భూములన్నీ డినోటిఫై చేయటానికి అనువైనవిగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీటి వివరాలను పంపడానికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదించడానికి రెడీగా ఆన్ లైన్ లో పొందుపరిచారు. కృష్ణాజిల్లా 8,727 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. […]

రాజధాని ప్రాంతంలో అటవీ భూముల లిస్ట్ రెడీ
X

కృష్ణాజిల్లాలో పరిశ్రమలు, ఇతర రాజధాని అవసరాలకు భారీ భూ బ్యాంక్ ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని 64451.88 హెక్టార్ల అటవీ భూముల్లో 39 వేల ఎకరాల భూములను రాజధాని అవసరాలకు వినియోగించుకోవచ్చని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ భూములన్నీ డినోటిఫై చేయటానికి అనువైనవిగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీటి వివరాలను పంపడానికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదించడానికి రెడీగా ఆన్ లైన్ లో పొందుపరిచారు.
కృష్ణాజిల్లా 8,727 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జిల్లా పరిధిలో అడవులు 504.73 స్క్వేర్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో అటవీ భూములు 5.78 శాతం ఉన్నాయి. ఓపెన్ ఫారెస్ట్ భూములు 370.34 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్నాయి. పిచ్చిచెట్లు, దుబ్బులతో కూడిన అటవీ భూములు 172.77, అటవీ భూములైనప్పటికీ నాన్ ఫారెస్ట్ అటవీ భూములు 46.57 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. నీటి వనరులున్న భూములు 51.85 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్నాయి.
మండలాల వారీగా.. మైలవరం రేంజ్ పరిధిలో ఎ.కొండూరు మండలంలో 1813.24 హెక్టార్లు, చండ్రగూడెం మండలంలో 920.51, చీమలపాడు 1884.83, కాకర్ల 647.16, పొందుగల 1640.52 హెక్టార్లు, టి.గన్నవరం 871.83, వెల్వడం 793.27 హెక్టార్లు, వినగడపలో 1,536.17 హెక్టార్ల చొప్పున మొత్తం 10,107.54 హెక్టార్ల అటవీ భూములున్నాయి.
నూజివీడు రేంజ్ పరిధిలో అన్నేరావుపేటలో 1370.26, చిల్ల బోయినపల్లిలో 760.78, చిన్నమ్మపేటలో 2113.95 ఎకరాలు, చిత్తపూర్ లో 949.89, కనిమెర్లలో 1489.08, కాట్రేనుపాడులో 1718.85 హెక్టార్లు, రమణక్కపేటలో 749.78, రెడ్డిగూడెంలో 1379.38, సుంకొల్లు 1425.70, యనమదల 500.03 ఎకరాల చొప్పున 12,457.70 హెక్టార్లు.
విజయవాడ రేంజ్ పరిధిలో దుగ్గిరాలపాడు 1693.89, ఈలి చెట్లదిబ్బలో 5217.50, గండ్రాయిలో 2181.43, జగ్గయ్యపేటలో 1850.56, జుజ్జూరులో 3448.42, కోడూరులో 1695.30, కొండపల్లిలో 1174.19, కొత్తూరు తాడేపల్లిలో 2400.63, మెట్లపల్లిలో 458.15, మూలపాడులో 5501.58, నాచుగుంటలో 7406.63, నున్నలో 1108.14, శోభనాపురంలో 999.30, సొర్లగుండిలో 5398.38 హెక్టార్ల చొప్పున 41,886.65 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి. మైలవరం, నూజివీడు, విజయవాడ రేంజ్ ల పరిధిలో మొత్తం 64,451.88 హెక్టార్ల అటవీ భూములున్నాయి.
సీఎం ఆదేశాలు.. కృష్ణాజిల్లాలో భూ బ్యాంక్ ను సిద్ధం చేయాలన్న యోచనతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు బాబు, గంధం చంద్రుడు అన్వేషణ సాగిస్తున్నారు. జిల్లాలో అటవీ, ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించి జేసీ చంద్రుడు మండలాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇటీవల కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంలో జిల్లాలో 15 వేల ఎకరాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా కలెక్టర్ కు సూచించారు. కలెక్టర్ బాబు సత్వరం స్పందించి జిల్లాలో 30 వేల ఎకరాలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ కృషితో ఇప్పుడా భూమి 39 వేలకు పెరిగింది. ఈ భూములన్నీ అటవీ భూములే కావడంతో రైతులకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

First Published:  27 May 2015 5:29 AM GMT
Next Story