Telugu Global
Cinema & Entertainment

 అఖిల్ పై క్లారిటీ ఇచ్చిన నితిన్

అఖిల్ సినిమాకు సంబంధించి హీరో నితిన్ క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ డెబ్యూ మూవీకి నిర్మాత కూడా కావడంతో నితిన్ స్పందించాల్సి వచ్చింది. తమ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదని స్పష్టంచేశాడు నితిన్. ఈమధ్య వారం రోజుల నుంచి నితిన్ కొత్త సినిమా టైటిల్ పై ప్రచారం జోరందుకుంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మిస్సైల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని, సోషల్ మీడియా కోడై కూసింది. దీనిపై నితిన్ క్లారిటీ ఇచ్చాడు. […]

 అఖిల్ పై క్లారిటీ ఇచ్చిన నితిన్
X
అఖిల్ సినిమాకు సంబంధించి హీరో నితిన్ క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ డెబ్యూ మూవీకి నిర్మాత కూడా కావడంతో నితిన్ స్పందించాల్సి వచ్చింది. తమ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదని స్పష్టంచేశాడు నితిన్. ఈమధ్య వారం రోజుల నుంచి నితిన్ కొత్త సినిమా టైటిల్ పై ప్రచారం జోరందుకుంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మిస్సైల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని, సోషల్ మీడియా కోడై కూసింది. దీనిపై నితిన్ క్లారిటీ ఇచ్చాడు. తమ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదని, టైటిల్ గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.
తాజాగా అఖిల్ సినిమా స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్ జరుగుతున్న టైమ్ లోనే కొడుకును చూసేందుకు నాగార్జున, అమల ఒకసారి స్పెయిన్ కూడా వెళ్లొచ్చారు. ఆ షెడ్యూల్ పూర్తిచేసుకున్న వెంటనే అఖిల్ హైదరాబాద్ తిరిగొచ్చాడు. నెల రోజులు రెస్ట్ తీసుకొని జులై 1 నుంచి ఆఫ్రికాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో అఖిల్ సరసన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది.
First Published:  27 May 2015 12:55 AM GMT
Next Story