Telugu Global
Cinema & Entertainment

బాలయ్య హీరోయిన్ కి కూడా సినిమాలు నచ్చలేదట..

మాములుగా ఒక హీరోయిన్ ఇండస్ట్రీ లో సెట్ అవ్వాలి అంటే కాస్త కష్ట పడాలి. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పోతూ ఒకేసారి స్టార్ హీరో తో నటించి స్టార్ హోదా అనుభవిస్తారు. కానీ ఒకసారి కొంచం సెట్ అయ్యాక మాత్రం ‘నేనప్పుడు అంత కష్ట పడ్డా, అప్పుడు అలా చేశా..’ అంటూ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మన లెజెండ్ హీరోయిన్ సోనాలి చౌహాన్ కూడా ఇలాగే చెప్తుంది.  ఆరేళ్ళ క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి […]

బాలయ్య హీరోయిన్ కి కూడా సినిమాలు నచ్చలేదట..
X

మాములుగా ఒక హీరోయిన్ ఇండస్ట్రీ లో సెట్ అవ్వాలి అంటే కాస్త కష్ట పడాలి. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పోతూ ఒకేసారి స్టార్ హీరో తో నటించి స్టార్ హోదా అనుభవిస్తారు. కానీ ఒకసారి కొంచం సెట్ అయ్యాక మాత్రం ‘నేనప్పుడు అంత కష్ట పడ్డా, అప్పుడు అలా చేశా..’ అంటూ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మన లెజెండ్ హీరోయిన్ సోనాలి చౌహాన్ కూడా ఇలాగే చెప్తుంది. ఆరేళ్ళ క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత హిందీ లో రెండు సినిమాలు చేసి బాలీవుడ్ హీరోయిన్ గా మారింది.

మళ్ళీ బాల కృష్ణ నటించి లెజెండ్ సినిమాతో తెలుగు లోకి వచ్చింది. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, ‘నాకు చాలా కథలు వచ్చాయి, కాని అవేమి నచ్చలేదు. గ్లామర్ తో పాటు పెర్ఫార మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ ఉన్న వాటి కోసం చూసి ఇంత లేట్ అయ్యింది ‘ అంటుంది. ఇక ప్రస్తుతం నటించిన ‘పండగ చేస్కో’ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని, ఇక ఈ సినిమాతో నా రేంజ్ కూడా కాస్త పెరుగుతుందని ధీమ వ్యక్తం చేస్తుంది. మ‌రి నిజంగా ఈ హాట్ బ్యూటీకి అంత సీన్ వ‌స్తుందంటారా..? ఏమో చెప్ప‌లేం క‌దా..!

First Published:  27 May 2015 4:50 AM GMT
Next Story