Telugu Global
Others

త్వ‌ర‌లో ఎన్టీఆర్ చీర‌, ధోవ‌తి ప‌థ‌కం: చ‌ంద్ర‌బాబు

ఎన్టీఆర్ పేరుతో చీర‌, ధోవ‌తి ప‌థ‌కం మ‌ళ్ళీ ప్ర‌వేశ పెడ‌తామ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. ఆయ‌న రెండో రోజు మ‌హానాడు వేదిక నుంచి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేద ప్ర‌జ‌ల గురించే నిత్యం ఆలోచించేవార‌ని, పేద‌వాడికి ప‌ట్టెడ‌న్నం, మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త ఎన్టీఆర్ ఆశ‌య‌మ‌ని చంద్ర‌బాబు తెలిపారు. స‌మాజ‌మే దేవాల‌యం, ప్ర‌జ‌లే దేవుళ్ళ‌న్న‌ది ఎన్టీఆర్ నినాద‌మ‌ని, దాన్ని సాకారం చేయ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు. చీర‌, ధోవ‌తి ప‌థ‌కానికి యేడాదికి 390 కోట్ల […]

త్వ‌ర‌లో ఎన్టీఆర్ చీర‌, ధోవ‌తి ప‌థ‌కం: చ‌ంద్ర‌బాబు
X
ఎన్టీఆర్ పేరుతో చీర‌, ధోవ‌తి ప‌థ‌కం మ‌ళ్ళీ ప్ర‌వేశ పెడ‌తామ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. ఆయ‌న రెండో రోజు మ‌హానాడు వేదిక నుంచి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేద ప్ర‌జ‌ల గురించే నిత్యం ఆలోచించేవార‌ని, పేద‌వాడికి ప‌ట్టెడ‌న్నం, మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త ఎన్టీఆర్ ఆశ‌య‌మ‌ని చంద్ర‌బాబు తెలిపారు. స‌మాజ‌మే దేవాల‌యం, ప్ర‌జ‌లే దేవుళ్ళ‌న్న‌ది ఎన్టీఆర్ నినాద‌మ‌ని, దాన్ని సాకారం చేయ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు. చీర‌, ధోవ‌తి ప‌థ‌కానికి యేడాదికి 390 కోట్ల రూపాయ‌ల వ్య‌య‌మ‌వుతుంద‌ని, 1,29 కోట్ల మందికి ల‌బ్ది చేకూరుతుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు గుర్తుగా చిర‌స్థాయిగా నిలిచి పోయేలా ఈ ప‌థ‌కాన్ని నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ రూపంలోనే దేవుడ్ని చూడ‌గ‌లిగామ‌ని, ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికీ ఆయ‌న రూపం దేవుడిలాగే క‌నిపిస్తోంద‌ని, అందుకే గోదావ‌రి పుష్క‌ర ఘాట్‌ల వ‌ద్ద రాముడు, కృష్ణుడి రూపాల్లో ఆయ‌న విగ్ర‌హాల్ని పెట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడ్ని భార‌త ర‌త్న‌తో గౌర‌వించ‌డం మ‌న విధ‌ని, అందుకే తాము ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరుతూ మ‌హానాడులో తీర్మానం చేశామ‌ని చెప్పారు.
ఎన్టీఆర్ ఆశ‌య సాధ‌నే తెలుగుదేశం ధ్యేయం: బాల‌కృష్ణ‌
వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని సినీ హీరో, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ అన్నారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను అధికారంలోకి తెచ్చింది ఎన్టీఆర్ అని, జాతీయ రాజ‌కీయాల్లో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. కోట్లాది ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగు నింపిన వ్య‌క్తి ఎన్టీఆర్ అని, ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తి కార్య‌క‌ర్త ఓ ఎన్టీఆర్ కావాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. జాతీయ రాజ‌కీయాల్లో నేష‌న‌ల్ ఫ్రంట్ ఏర్పాటుతో అన్ని పార్టీల‌ను ఆయ‌న ఏక‌తాటిపైకి తెచ్చార‌ని దీంతో కాంగ్రెస్ తునాతున‌క‌లై పోయింద‌ని, ఈ ఘ‌న‌త ఎన్టీఆర్‌కే ద‌క్కింద‌ని బాల‌కృష్ణ చెప్పారు. ఆయ‌న మంచి సంఘ సంస్క‌ర్త అని, తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కు ఎన్టీఆర్ పేరు గుర్తుండిపోతుంద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ఇచ్చే వ‌ర‌కు విశ్ర‌మించ‌కుండా పోరాడ‌తామ‌ని ఆయ‌న తెలిపారు.
First Published:  28 May 2015 2:07 AM GMT
Next Story