Telugu Global
Others

ఆర్జేడీ, జేడీయూ మధ్య కొలిక్కిరాని భేదాభిప్రాయాలు

అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్న బీహార్‌లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అధికార జేడీయూ లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఓ కొలిక్కి రావడం లేదు. ఏక పార్టీగా ఏర్పడాలని అనుకుంటున్న జనతా పరివార్‌ కూటమిలో బీహార్‌కు చెందిన ఆర్జేడీ, జేడీయూ ప్రధాన పార్టీలు విలీనానంతర పరిస్థితులపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అటు లాలూ, ఇటు నితీష్‌ ఇద్దరూ తమ ఆధిప‌త్యం కోసం ప్రయత్నిస్తున్నారు. మరో 4, 5 […]

ఆర్జేడీ, జేడీయూ మధ్య కొలిక్కిరాని భేదాభిప్రాయాలు
X
అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్న బీహార్‌లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అధికార జేడీయూ లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఓ కొలిక్కి రావడం లేదు. ఏక పార్టీగా ఏర్పడాలని అనుకుంటున్న జనతా పరివార్‌ కూటమిలో బీహార్‌కు చెందిన ఆర్జేడీ, జేడీయూ ప్రధాన పార్టీలు విలీనానంతర పరిస్థితులపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అటు లాలూ, ఇటు నితీష్‌ ఇద్దరూ తమ ఆధిప‌త్యం కోసం ప్రయత్నిస్తున్నారు. మరో 4, 5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రెండు పార్టీలు పైచేయి కోసం పట్టుదలగా ఉన్నాయి. అయితే కొత్త పార్టీ ఏర్పాటులో జాప్యాన్ని ఆర్జేడి – జేడీయూ మధ్య విబేధాలుగా చూడనవసరం లేదని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. నితీష్‌ కుమార్‌కు, తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని లాలూ చెప్పారు. అయితే సీఎం అభ్యర్థిత్వం విషయంలో రెండు పార్టీల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని తెలియవచ్చింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జితిన్‌రాం మాంజీ బీజేపీకి చేరువవుతున్నారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఆయన 1, 2 రోజుల్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
First Published:  28 May 2015 12:22 PM GMT
Next Story