Telugu Global
Cinema & Entertainment

పవన్ కొత్త దర్శకుడు డాలీ

దాసరి నారాయణరావుతో పవన్ కల్యాణ్ చేయబోయే సినిమాకు దర్శకుడు ఎవరో తెలిసిపోయింది. గోపాల గోపాల సినిమాతో ఆకట్టుకున్న డాలీతో సెట్స్ పైకి వెళ్లడానికి ప్రాధమికంగా నిర్ణయించుకున్నాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం గబ్బర్ సింగ్-2 పనుల్లో బిజీగా ఉన్న పవన్.. ఈమధ్యే డాలీ చెప్పిన ఓ స్టోరీ లైన్ ను విన్నాడు. కుదిరితే దాసరి నారాయణరావు నిర్మాణంలో ఆ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అందుకే చర్చల కోసం డాలీని దాసరి ఇంటికి పంపించాడు.ప్రస్తుతం డాలీ-దాసరి కలిసి పవన్ కొత్త […]

పవన్ కొత్త దర్శకుడు డాలీ
X
దాసరి నారాయణరావుతో పవన్ కల్యాణ్ చేయబోయే సినిమాకు దర్శకుడు ఎవరో తెలిసిపోయింది. గోపాల గోపాల సినిమాతో ఆకట్టుకున్న డాలీతో సెట్స్ పైకి వెళ్లడానికి ప్రాధమికంగా నిర్ణయించుకున్నాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం గబ్బర్ సింగ్-2 పనుల్లో బిజీగా ఉన్న పవన్.. ఈమధ్యే డాలీ చెప్పిన ఓ స్టోరీ లైన్ ను విన్నాడు. కుదిరితే దాసరి నారాయణరావు నిర్మాణంలో ఆ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అందుకే చర్చల కోసం డాలీని దాసరి ఇంటికి పంపించాడు.
ప్రస్తుతం డాలీ-దాసరి కలిసి పవన్ కొత్త సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. పవన్ సినిమా ఎలా ఉండాలనే అంశంపై దాసరికి కొన్ని ఆలోచనలున్నాయి. ఇటు పవన్ కు డాలీ వినిపించిన స్టోరీ లైన్ కూడా సిద్ధంగా ఉంది. మొత్తంగా 3 స్క్రిప్ట్ లు సిద్ధంచేస్తున్నారు. వీటిని పవన్ కు వినిపించి, వాటిలోంచి ఒకటి సెలక్ట్ చేయమంటారు. పవన్ ఓకే చెప్పిన వెంటనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అయితే పవన్-దాసరి కాంబోలో వస్తున్న సినిమాకు డాలీనే దర్శకుడు అనే విషయాన్ని ఇంకా అధికారికంగా కన్ ఫర్మ్ చేయలేదు.

First Published:  28 May 2015 12:25 AM GMT
Next Story