మ‌హేష్ హీరోయిన్ చాల బ‌ద్ద‌కస్తురాలు..!

 కృతి స‌న‌న్..  మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కు  బాగా తెలిసిన హీరోయిన్. ఎందుకంటే త‌మ అభిమాన హీరో స‌ర‌స‌న  తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది.  సుకుమార్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఆ చిత్రం  ఘ‌న విజ‌యం సాధించ లేదు  కానీ..  న‌టిగా  కృతి స‌న‌న్  సెకండ్ క్లాస్ మార్కులు  గెయిన్ చేసింది.    ఈ మ‌ధ్య దోచేయ్ అంటూ  నాగ చైత‌న్య స‌ర‌స‌న మ‌రో చిత్రంలో న‌టించి మెప్పించింది.   గ్లామ‌ర్ హీరోయిన్  అంటే ఫ్యాష‌న్  విష‌యాల ప‌ట్ల  అప్ డేట్  అవుతుండాలి.
     ఈ విష‌యంలో  త‌ను మాత్రం చాల బ‌ద్ద‌కిస్టు అంటోంది. అయితే   బాలీవుడ్ లో  స్టైల్ ఐకాన్  అంటే సోన‌మ్ క‌పూర్, దీపిక ప‌దుకోణ్, ప్రియాంక చోప్రా లే అంటోంది. వీరి ముగ్గురి త‌రువాత‌నే ఎవ‌రైనా అని కితాబిచ్చింది. ప్ర‌స్తుతం దిల్ వాలే చిత్రంలో షారుక్ స‌ర‌స‌న  ఒక ఛాన్స్ కొట్టేసిన  ఈ చిన్న‌ది  టాలీవుడ్ లో ఎప్ప‌టికైన  టాప్ లీగ్ లోకి ఎంట్రీ కొట్టాల‌నే క‌సితో వున్న‌ట్లు తెలిపింది.