Telugu Global
Others

ప్ర‌భుత్వ పునాదుల్ని ప‌టిష్టం చేశాం: కేటీఆర్‌

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను సాధించాలంటే పునాదులు బ‌లంగా ఉండాల‌ని అందుకే తొలి యేడాదంతా ప్ర‌భుత్వానికి పునాదులు వేసే ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌య్యామ‌ని తెలంగాణ ఐటీ మంత్రి కె. తార‌క రామారావు తెలిపారు. యేడాది కాలంలో ఎన్నో స‌వాళ్ళు ఎదుర్కొన్నామ‌ని, అయినా ఎక్క‌డా ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేయ‌కుండా సంక‌ల్ప బ‌లంతో ముందుకు వెళుతుంద‌ని ఆయ‌న అన్నారు. యేడాది పాల‌న‌పై కేటీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌మ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌కు ఆమోద‌యోగ్యంగా ముందుకు వెళుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఓయూ భూముల విష‌యంలో […]

ప్ర‌భుత్వ పునాదుల్ని ప‌టిష్టం చేశాం: కేటీఆర్‌
X
దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను సాధించాలంటే పునాదులు బ‌లంగా ఉండాల‌ని అందుకే తొలి యేడాదంతా ప్ర‌భుత్వానికి పునాదులు వేసే ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌య్యామ‌ని తెలంగాణ ఐటీ మంత్రి కె. తార‌క రామారావు తెలిపారు. యేడాది కాలంలో ఎన్నో స‌వాళ్ళు ఎదుర్కొన్నామ‌ని, అయినా ఎక్క‌డా ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేయ‌కుండా సంక‌ల్ప బ‌లంతో ముందుకు వెళుతుంద‌ని ఆయ‌న అన్నారు. యేడాది పాల‌న‌పై కేటీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌మ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌కు ఆమోద‌యోగ్యంగా ముందుకు వెళుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఓయూ భూముల విష‌యంలో అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని, ఆ భూముల‌ను స్వాధీనం చేసుకున్నా అక్క‌డ పేద‌ల‌కు ఇళ్ళు మాత్ర‌మే క‌డ‌తామ‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు త‌మ‌కూ బాధ క‌లిగిస్తున్నాయ‌ని, అయితే ఈ పాపం గ‌త ప‌దేళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వానిదేన‌ని ఆయ‌న ఆరోపించారు. అన్ని రంగాల్ని స‌మ‌న్వ‌యం చేసుకుని ముదుకెళుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్య‌తిరేకించిన వాళ్ళు కూడా ఈరోజు త‌మ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నార‌ని కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడుతున్నామ‌ని, దీనివ‌ల్ల హైద‌రాబాద్లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి చాలామంది ముందుకొస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఎండాకాలంలో విద్యుత్ కోత‌లు లేకుండా చేశామ‌ని, ఆ ఘ‌న‌త కేసీఆర్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని ఆయ‌న అన్నారు. రాబోయే నాలుగేళ్ళ‌లో ఐటీ ఎగుమ‌తులు రెట్టింపు చేయ‌నున్నామ‌ని, తాను ఇత‌ర దేశాల్లో జ‌రిపిన ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జ‌ర‌గ‌నుంద‌ని ఆయ‌న అన్నారు. 15 రోజుల్లో పెద్ద ఇంక్యుబేట‌ర్‌ను ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. ఏపీ ప్ర‌భుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింద‌ని, ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేక‌పోయింద‌ని, అందుకే మ‌హానాడును ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాకుండా హైద‌రాబాద్‌లో పెట్టుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఒక‌వేళ మ‌హానాడు ఏపీలో పెట్టుకుంటే అక్క‌డి జ‌నం కొడ‌తార‌నే భ‌యంతోనే ఈ ప్రాంతాన్ని వేదిక చేసుకుంద‌ని కేటీఆర్ అన్నారు.
62 యేళ్ళ యువ‌కుడు కేసీఆర్
తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు 62 యేళ్ళ యువ‌కుడ‌ని, ఆయ‌న స్పీడ్‌ను తాము అందుకోలేక పోతున్నామ‌ని ఐటీ మంత్రి, కేసీఆర్ త‌న‌యుడు తార‌క‌రామారావు అన్నారు. ఆయ‌న మ‌రో 30 సంవ‌త్స‌రాల‌పాటు తెలంగాణ‌ను పాలిస్తార‌ని ఆయ‌న చెప్పారు. బంగారు తెలంగాణ ఆయ‌న క‌ల అని, దాన్ని సాకారం చేయ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నం చేస్తున్నారని చెప్పారు. విమ‌ర్శ‌ల‌కు వెరిసే త‌త్వం కేసీఆర్‌కు లేద‌ని, తాను న‌మ్మిన సిద్ధాంతాన్ని అమలు చేయ‌డానికి ఆయ‌న ఎప్పుడూ వెనుకాడ‌ర‌ని కేటీఆర్ తెలిపారు. ఆయ‌న చూపించే మార్గంలోనే తామంతా ప‌య‌నిస్తామ‌ని, ఆయ‌నే త‌మ‌కు మార్గ‌ద‌ర్శ‌కుడ‌ని అన్నారు.
మ‌హానాడు అంటే సినిమా సెట్టింగ్స్‌, డ్యాన్స్: క‌విత‌
తెలుగుదేశం పార్టీ నిర్వ‌హిస్తున్న మ‌హానాడు సినిమా సెట్టింగ్స్‌, డ్యాన్సుల‌ను త‌ల‌పిస్తోంద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత విమ‌ర్శించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటున్న ఏపీ సీఎం చంద్రబాబు సవాలుపై చర్చకు సిద్ధమని కవిత ప్రకటించారు. హైదరాబాద్‌లోని భూములను దోచుకున్నారని ఆమె ఆరోపించారు. సురవరం ప్రతాప్‌రెడ్డి 119వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి ఎంపీ కవిత నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. తెలుగువర్శిటీ విడిపోతే సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెడతామని ఆమె పేర్కొన్నారు.
First Published:  28 May 2015 4:14 AM GMT
Next Story