Telugu Global
Cinema & Entertainment

ల‌క్ష్మీరాయ్ వ‌య‌సంతేనా..!

ఒక హీరోయిన్ కెరీర్ నిలబడాలి అంటే కాస్త నటనతో పాటు, లెక్కకు మించిన అందం ఉండాలి. కొంత మందికి ఈ రెండూ ఉన్నా కాని అదృష్టం కలిసిరాక చిన్నచిన్న సినిమాలకే పరిమితం అవుతారు. ఇలాంటి వారి జాబితాలోకి చేరింది హాట్ అండ్ సెక్సీ బ్యూటీ లక్ష్మీరాయ్.  చూడటానికి అందం, అందరికంటే పొడుగు, అందాల ఆరబోతకి ఏమాత్రం వెనకాడని లక్ష్మీరాయ్ కి వచ్చిన అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఈ మద్య తన వయస్సు గురించి చెప్తూ […]

ల‌క్ష్మీరాయ్ వ‌య‌సంతేనా..!
X

ఒక హీరోయిన్ కెరీర్ నిలబడాలి అంటే కాస్త నటనతో పాటు, లెక్కకు మించిన అందం ఉండాలి. కొంత మందికి ఈ రెండూ ఉన్నా కాని అదృష్టం కలిసిరాక చిన్నచిన్న సినిమాలకే పరిమితం అవుతారు. ఇలాంటి వారి జాబితాలోకి చేరింది హాట్ అండ్ సెక్సీ బ్యూటీ లక్ష్మీరాయ్. చూడటానికి అందం, అందరికంటే పొడుగు, అందాల ఆరబోతకి ఏమాత్రం వెనకాడని లక్ష్మీరాయ్ కి వచ్చిన అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఈ మద్య తన వయస్సు గురించి చెప్తూ ఇప్పటికి నా వయస్సు 26. నేను ఎత్తుగా ఉండటం వల్ల అలా కనిపిస్తున్నా. మీకు అంతగా నమ్మకం లేకపోతే నా బర్త్ సర్టిఫికేట్ చూపిస్తా చూడండి. నేను 15 సంవత్సరాలకే ఒక తమిళ్ సినిమా చేశా. తెలుగు నటించే సమయానికి నా వయస్సు 16. నన్ను చూసి మా ఇంట్లో వాల్లే కంగారు పడేవాళ్ళు, నాకు పెళ్లి ఎలా చేయాలా అని చెప్తుంది. చూడటానికి పెద్ద కటౌట్ లా కనిపించే లక్ష్మీరాయ్, మాములుగా చిన్న హీరో ల పక్కన సెట్ అవదు అని అందరి అభిప్రాయం. అందుకే అవకాశాలు కుడా ఎక్కువగా రావడం లేదని ఈ బ్యూటీ ఫీల్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఇలా తన వయస్సు గురించి చెప్తే అప్పుడైనా ఎవరైనా ఈమె వైపు ఒకసారి చూస్తారేమో అని చిన్న ఆశ ఈ బొద్దుగుమ్మ‌ది.

First Published:  28 May 2015 4:26 AM GMT
Next Story