Telugu Global
Cinema & Entertainment

 బాహుబలి కోసం లేటెస్ట్ టెక్నాలజీ

ట్రయిలర్ తోనే సంచలనం సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. అందుకే బాహుబలి ట్రయిలర్ కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాడు. ఈ సినిమా ట్రయిలర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తెరకెక్కుతోంది. డాల్బీ ఎట్నోస్ సరౌండ్ సౌండ్ పరిజ్ఞానాన్ని బాహుబలి ట్రయిలర్ కు వాడుతున్నారు. నిజానికి ఇండియాలోని చాలా థియేటర్లలో ఈ పెసిలిటీ లేదు. అయినప్పటికీ టెక్నాలజీ విషయంలో తగ్గకూడదనే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో సినిమాకు ప్రమోషన్ రావాలంటే కటింగ్ ఎడ్జ్ […]

 బాహుబలి కోసం లేటెస్ట్ టెక్నాలజీ
X
ట్రయిలర్ తోనే సంచలనం సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. అందుకే బాహుబలి ట్రయిలర్ కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాడు. ఈ సినిమా ట్రయిలర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తెరకెక్కుతోంది. డాల్బీ ఎట్నోస్ సరౌండ్ సౌండ్ పరిజ్ఞానాన్ని బాహుబలి ట్రయిలర్ కు వాడుతున్నారు. నిజానికి ఇండియాలోని చాలా థియేటర్లలో ఈ పెసిలిటీ లేదు. అయినప్పటికీ టెక్నాలజీ విషయంలో తగ్గకూడదనే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో సినిమాకు ప్రమోషన్ రావాలంటే కటింగ్ ఎడ్జ్ కంపల్సరీ అని ఫీలవుతున్నాడు కరణ్ జోహార్. ఈ హైటెక్ పరిజ్ఞానంతో తెరకెక్కిన ట్రయిలర్ ను బాలీవుడ్ ప్రముఖుల మధ్య ఓ సినిమా థియేటర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు కరణ్. ప్రస్తుతానికైతే ట్రయిలర్ సిద్ధమైంది. బాలీవుడ్ లో ఎప్పుడు లాంచ్ చేయాలనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ఒకరి కోసం కరణ్ ప్రయత్నిస్తున్నాడు. వీళ్లలో ఒకరు కన్ ఫర్మ్ అయినవెంటనే బాలీవుడ్ లో బాహుబలి ట్రయిలర్ లాంచ్ ఉంటుంది.

First Published:  28 May 2015 12:53 AM GMT
Next Story