Telugu Global
Cinema & Entertainment

షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌నుంటే ప‌ని ప‌రిగెడుతుంది..!

తెలుగు వారి  గ‌ర్వించి ద‌గిన అగ్ర న‌టుల్ల‌తో  నంద‌మూరి తార‌క రామ‌రావు ఒక‌రు.  న‌టుడిగా ఆయ‌న ఏ పాత్ర పోషించిన ప‌ర‌కాయ   ప్ర‌వేశం చేసి..   అద్భుతంగా పండించ‌డంలో  దిట్ట అనిపించుకున్నారు.  జోన‌ర్ ఏదైనా.. రోల్ ఎటువంటిదినా.. న‌వ ర‌సాల్లో ఏ రసానైనా  ఔర ఇది  అన్న‌గారు మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు అనిపించిన రోల్స్ ఎన్నో చేశారు.  త‌న స‌మ‌కాలిన న‌టుల్లో ఒక ఉత్త‌మ న‌టుడు అనిపించుకున్న  ఎన్టీఆర్.. ఆ త‌రువాత  కాలంలో  తెలుగు దేశం పార్టీ స్థాపించి   ముఖ్య‌మంత్రి […]

షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌నుంటే ప‌ని ప‌రిగెడుతుంది..!
X

తెలుగు వారి గ‌ర్వించి ద‌గిన అగ్ర న‌టుల్ల‌తో నంద‌మూరి తార‌క రామ‌రావు ఒక‌రు. న‌టుడిగా ఆయ‌న ఏ పాత్ర పోషించిన ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి.. అద్భుతంగా పండించ‌డంలో దిట్ట అనిపించుకున్నారు. జోన‌ర్ ఏదైనా.. రోల్ ఎటువంటిదినా.. న‌వ ర‌సాల్లో ఏ రసానైనా ఔర ఇది అన్న‌గారు మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు అనిపించిన రోల్స్ ఎన్నో చేశారు. త‌న స‌మ‌కాలిన న‌టుల్లో ఒక ఉత్త‌మ న‌టుడు అనిపించుకున్న ఎన్టీఆర్.. ఆ త‌రువాత కాలంలో తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్య‌మంత్రి అయ్యారు. త‌మిళ‌నాట ఎమ్జీఆర్ మాదిరే .. సినిమాల్లో వ‌చ్చిన పేరును తెలివిగా రాజ‌కీయాల‌కు మ‌ల‌చుకుని ఈ రంగంలో కూడా త‌న‌దైన ముద్ర చూపించారు.
ఇక ఇదిలా వుంటే.. ఎన్టీ రామ‌రావు వ్య‌క్తి గ‌తంగా ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన వార‌నే పేరుంది. ఆయ‌న స‌మ‌కాలిన న‌టీ న‌టులు చాల‌మంది చెప్పిన మాట ఇది. ఆయ‌న లోకేష‌న్ లో వుంటే స‌మ‌యం వృదా కావ‌డం అనే మాటే వుండేది కాద‌ట‌. ఆయ‌న సినిమా కెరీర్ లో ఏనాడు.. రామ‌రావు కార‌ణంగా షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని గానీ.. ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు వెయిట్ చేస్తున్నార‌ని గాని.. రామ‌రావు లైప్ టైమ్ లో అటువంటి స‌మ‌స్య విన‌లేదంటే ఆయ‌న ఎంత క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వుండే వారో అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. ఈ మాట‌లు స్వ‌యంగా రామ‌రావు స‌మ‌కాలికులు ఆయ‌న త‌మిళ లెజండ్రి యాక్ట‌ర్ విజ‌య చిత్ర అనే సినిమా ప‌త్రిక‌లో చెప్పిన‌ట్లు చెబుతారు. ఈ రోజుల్లో రామ‌రావు లాంటి క్ర‌మ‌శిక్ష‌ణ వున్న న‌టుల్ని వేళ్ల‌మీద లెక్కించ వ‌చ్చు అంటారు ప‌రిశీల‌కులు. నిజ‌మే క‌దా.! జ‌న‌రేష‌న్ మారిపోయింది క‌దా.!

First Published:  28 May 2015 3:56 AM GMT
Next Story