Telugu Global
Cinema & Entertainment

ఇద్దరు సూపర్ స్టార్లు కలుస్తున్న వేళ

బాలీవుడ్ లో సూపర్ స్టార్లు అంటే ప్రస్తుతం ఇద్దరే. వాళ్లే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్. కానీ ఇద్దరికీ కొన్ని దశాబ్దాలుగా పడదు. ఏదో రంజాన్ వేళల్లో కలుసుకొని ఆలింగనం చేసుకోవడం తప్ప మిగతా రోజుల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఇద్దరి మధ్య. అయితే కొందరు దర్శక-నిర్మాతలు మాత్రం వాళ్లను హీరోలుగా పెట్టి మల్టీస్టారర్ సినిమా చేయాలనే ప్రయత్నాల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు హీరోల మధ్య స్నేహం చిగురించే అరుదైన ఘటన ఒకటి […]

ఇద్దరు సూపర్ స్టార్లు కలుస్తున్న వేళ
X
బాలీవుడ్ లో సూపర్ స్టార్లు అంటే ప్రస్తుతం ఇద్దరే. వాళ్లే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్. కానీ ఇద్దరికీ కొన్ని దశాబ్దాలుగా పడదు. ఏదో రంజాన్ వేళల్లో కలుసుకొని ఆలింగనం చేసుకోవడం తప్ప మిగతా రోజుల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఇద్దరి మధ్య. అయితే కొందరు దర్శక-నిర్మాతలు మాత్రం వాళ్లను హీరోలుగా పెట్టి మల్టీస్టారర్ సినిమా చేయాలనే ప్రయత్నాల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు హీరోల మధ్య స్నేహం చిగురించే అరుదైన ఘటన ఒకటి జరిగింది. సల్మాన్ కొత్త సినిమా బజరంగీ భాయ్ జాన్ కు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది.

ఈ ఫస్ట్ లుక్ ను స్వయంగా షారూక్ విడుదల చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. సల్మాన్ నటిస్తున్న ఈ తాజా చిత్రం సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నానంటూ షారూక్ ట్వీట్ కూడా చేశాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట కోర్టుకేసులతో ఇబ్బందిపడిన సల్మాన్ ను షారూక్ పరామర్శించడంతో ఇద్దరి మధ్య దూరం బాగా తగ్గిందని చెప్పుకుంటోంది బాలీవుడ్. ఈ నేపథ్యంలో సల్మాన్-షారూక్ కలిసి ఓ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీళ్ల కామన్ ఫ్రెండ్ అయిన కరణ్ జోహార్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు.

First Published:  27 May 2015 11:46 PM GMT
Next Story