Telugu Global
NEWS

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాల విడుద‌ల... ఆంధ్ర అమ్మాయి మెడిసిన్ టాప‌ర్‌

తెలంగాణ‌లో ఎంసెంట్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. మెడిసిన్‌లో 85.98 శాతం విద్యార్థులు అర్హ‌త సాధించ‌గా ఇంజినీరింగ్‌లో 70.65 శాతం అర్హ‌త సాధించారు. ఈ విష‌యాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యామంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. ఆయ‌న చెప్పిన వివ‌రాల ప్ర‌కారం… మెడిసిన్‌లో మొద‌టి ర్యాంకు ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా విద్యార్థినికి ద‌క్కింది. 160 మార్కుల‌తో  ఉప్ప‌ల‌పాటి ప్రియాంక‌ మొద‌టి ర్యాంకు సాధించ‌గా, 159 మార్కుల‌తో ద్వితీయ స్థానంలో  శ్రీ‌నిధి నిలిచారు. 159 మార్కుల‌తో అనుహ్య తృతీయ స్థానంలో ఉండ‌గా […]

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాల విడుద‌ల... ఆంధ్ర అమ్మాయి మెడిసిన్ టాప‌ర్‌
X
తెలంగాణ‌లో ఎంసెంట్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. మెడిసిన్‌లో 85.98 శాతం విద్యార్థులు అర్హ‌త సాధించ‌గా ఇంజినీరింగ్‌లో 70.65 శాతం అర్హ‌త సాధించారు. ఈ విష‌యాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యామంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. ఆయ‌న చెప్పిన వివ‌రాల ప్ర‌కారం… మెడిసిన్‌లో మొద‌టి ర్యాంకు ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా విద్యార్థినికి ద‌క్కింది. 160 మార్కుల‌తో ఉప్ప‌ల‌పాటి ప్రియాంక‌ మొద‌టి ర్యాంకు సాధించ‌గా, 159 మార్కుల‌తో ద్వితీయ స్థానంలో శ్రీ‌నిధి నిలిచారు. 159 మార్కుల‌తో అనుహ్య తృతీయ స్థానంలో ఉండ‌గా 158 మార్కుల‌తో మిగిలిన ఏడు ర్యాంకులు సాధించారు. నాలుగో ర్యాంకు సాయితేజ‌, ఐదో ర్యాంకు చెన్నూరి సాయితేజ రెడ్డి, ఆరో ర్యాంకు తేజేశ్వ‌ర‌రావు, ఏడో ర్యాంకు పొన్నాడ నాగ స‌త్య వ‌ర‌ల‌క్ష్మి, ఎనిమిదో ర్యాంకు ష‌ణ్ముఖి, తొమ్మిదో ర్యాంకు గుప్త‌, ప‌దో ర్యాంకు సాయి ప్రీతం కిర‌ణ్‌రెడ్డి ద‌క్కించుకున్నార‌ని విద్యా మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. ఇంజినీరింగ్‌లో రంగారెడ్డి జిల్లాకు ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, ఐదో ర్యాంకులు ద‌క్కాయి. మూడు, ఏడు ర్యాంకులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌న‌గ‌రానికి ల‌భించాయి. నాలుగు, ఆరు, ఎనిమిది ర్యాంకులు హైద‌రాబాద్‌కి ద‌క్కాయి. ఇక వ‌రంగ‌ల్ జిల్లాకు ఒక‌టి ద‌క్కింది. 157 మార్కుల‌తో ప్ర‌థ‌మ ర్యాంకు సాయి సందీప్, 2వ ర్యాంకు రౌతు నీహార్‌చంద్ర- 156 మార్కులు, 3వ ర్యాంకు జ్యోతికీర్తన-155 మార్కులు. 4వ ర్యాంకు గుత్తా సాయితేజ- 155మార్కులు సాధించారు. 154 మార్కుల‌తో 5వ ర్యాంకు వెన్నెపూస హేమంత్‌రెడ్డి, 6వ ర్యాంకు శ్రీహర్ష, 7వ ర్యాంకు సందీప్‌కుమార్‌, 8వ ర్యాంకు గార్లపాటి శ్రీకర్ ద‌క్కించుకున్నారు. 153 మార్కుల‌తో 9వ ర్యాంకు సాధించిన‌ దొంతుల అక్షితరెడ్డికి, ప‌దో ర్యాంకు కొండపల్లి అనిరుధ్‌రెడ్డికి ల‌భించాయి. అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు రేప‌టి నుంచి ఓఎంఆర్ ఆన్స‌ర్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని, జూన్ 18 నుంచి స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌ని క‌డియం తెలిపారు.
First Published:  28 May 2015 2:31 AM GMT
Next Story