Telugu Global
Cinema & Entertainment

ఇప్పుడు నేను గౌర‌వంగా బ‌తుకుతున్నా: స‌న్నీ లియోన్‌

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి తాను గౌర‌వ‌ప్ర‌దంగా బ‌తుకుతున్నాన‌ని , త‌న గ‌త జీవితాన్ని ఇప్పుడు తెర‌పైకి తీసుకురావ‌డం స‌బబుకాద‌ని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. తనపై నమోదైన కేసులో వివరణ ఇచ్చేందుకు బుధవారం ఆమె థానే పోలీసుల ఎదుట హాజరైంది. స‌న్నీ లియోన్ వ‌ల్ల యువ‌త చెడిపోయే ప్ర‌మాద‌ముంద‌ని ఇటీవ‌ల థానేలో ఓ మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. ఈ మేరకు స‌న్నీ థానే పోలీసుల ఎదుట హాజ‌రై […]

ఇప్పుడు నేను గౌర‌వంగా బ‌తుకుతున్నా: స‌న్నీ లియోన్‌
X
బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి తాను గౌర‌వ‌ప్ర‌దంగా బ‌తుకుతున్నాన‌ని , త‌న గ‌త జీవితాన్ని ఇప్పుడు తెర‌పైకి తీసుకురావ‌డం స‌బబుకాద‌ని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. తనపై నమోదైన కేసులో వివరణ ఇచ్చేందుకు బుధవారం ఆమె థానే పోలీసుల ఎదుట హాజరైంది. స‌న్నీ లియోన్ వ‌ల్ల యువ‌త చెడిపోయే ప్ర‌మాద‌ముంద‌ని ఇటీవ‌ల థానేలో ఓ మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. ఈ మేరకు స‌న్నీ థానే పోలీసుల ఎదుట హాజ‌రై వివ‌ర‌ణ ఇచ్చింది. ‘ఆ అభ్యంతరకర వీడియో నేను అమెరికాలో పెద్దల సినిమాలు చేస్తున్నప్పుడు తీసినది. భారతీయ సినిమా పరిశ్రమలో భాగం అయిన తర్వాత అటువంటి పాత్రలకు దూరంగా ఉంటున్నాను. గౌరవప్రదంగా బతుకుతున్న నన్ను గత జీవితంతో వెంటాడడం సబబు కాదు’ అని పోలీసులతో చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
First Published:  28 May 2015 12:06 AM GMT
Next Story