Telugu Global
NEWS

ఓయూ భూమి విద్యార్థులదే.. పరాధీనం చేస్తే ఊరుకోం: బాబు

ఉస్మానియా యూనివర్సిటీ భూములు విద్యార్థులకే చెందుతాయని, వాటిని పరాధీనం చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. యూనివర్సిటీ భూములు విద్యార్థులకే చెందాలని, వాటిపై హక్కు వారిదే. ఆ భూములను పరాధీనం చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గండిపేట తెలుగువిజయంలో జరుగుతున్న మహానాడులో గురువారం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎర్రబెల్లి దయాకరరావు చర్చను […]

ఓయూ భూమి విద్యార్థులదే.. పరాధీనం చేస్తే ఊరుకోం: బాబు
X
ఉస్మానియా యూనివర్సిటీ భూములు విద్యార్థులకే చెందుతాయని, వాటిని పరాధీనం చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. యూనివర్సిటీ భూములు విద్యార్థులకే చెందాలని, వాటిపై హక్కు వారిదే. ఆ భూములను పరాధీనం చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గండిపేట తెలుగువిజయంలో జరుగుతున్న మహానాడులో గురువారం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎర్రబెల్లి దయాకరరావు చర్చను ప్రారంభిస్తూ ఓయూ భూములను పక్కా ఇళ్ల నిర్మాణ అవసరాలకు వినియోగించాలన్న ప్రభుత్వ యోచనను తప్పుబట్టారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘గతంలో ఉస్మానియా భూములను కబ్జా చేయాలని చూశారు. దాన్ని అడ్డుకున్నాం. గతంలో ఓ సీఎం వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఇవ్వాలని చూశారు. వ్యతిరేకత రావడంతో ఆగిపోయారు. హైదరాబాద్‌లో భూములను రక్షించిన చరిత్ర మనదే. ఉస్మానియా విద్యార్థులు చాలా త్యాగాలు చేశారు. ఓయూ భూములు విద్యార్థులకే చెందాలి. ఇతరత్రా అవసరాలకు వినియోగించడం సరికాదు. దాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన టీడీపీ.. అందులో ఉస్మానియా భూముల అంశాన్ని పేర్కొంది. తెలంగాణ కేబినెట్‌లో మహిళలకు, ఎస్సీలకు స్థానం కల్పించాలని, రైతులకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలని, ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసుకోవాలని సూచించింది.
First Published:  29 May 2015 4:13 AM GMT
Next Story