Telugu Global
Others

ఆకలి రాజ్యం భారత్!

కడుపు నిండా తిండి.. క‌ట్టుకోడానికి బట్ట.. నీడ కోసం గూడు ఈ మూడుంటే చాలు జీవితం సాఫీగా గడిచిపోతుందని అనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ స్వాతంత్రం వ‌చ్చి దాదాపు డెబ్బై యోళ్ళ ద‌రిదాపుల్లోకి వ‌స్తున్నా ఇంకా దేశంలో అన్నమో రామచంద్ర అంటూ అలమటించిపోయే వారి సంఖ్య‌కు కొద‌వ లేదు. ఈ మాట‌లు ఎవ‌రో చెబుతున్న‌వి కావు. ప్ర‌పంచానికి దిక్చూచిగా ప‌ని చేసే ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించిన సత్యం! ఈ సమితి నివేదిక ప్ర‌కారం…ప్రపంచంలోనే ఆకలిరాజ్యాల్లో భారత్‌ […]

ఆకలి రాజ్యం భారత్!
X
కడుపు నిండా తిండి.. క‌ట్టుకోడానికి బట్ట.. నీడ కోసం గూడు ఈ మూడుంటే చాలు జీవితం సాఫీగా గడిచిపోతుందని అనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ స్వాతంత్రం వ‌చ్చి దాదాపు డెబ్బై యోళ్ళ ద‌రిదాపుల్లోకి వ‌స్తున్నా ఇంకా దేశంలో అన్నమో రామచంద్ర అంటూ అలమటించిపోయే వారి సంఖ్య‌కు కొద‌వ లేదు. ఈ మాట‌లు ఎవ‌రో చెబుతున్న‌వి కావు. ప్ర‌పంచానికి దిక్చూచిగా ప‌ని చేసే ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించిన సత్యం! ఈ సమితి నివేదిక ప్ర‌కారం…ప్రపంచంలోనే ఆకలిరాజ్యాల్లో భారత్‌ అగ్రరాజ్యంగా నిలిచింది. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) నివేదిక ‘ద స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ఇన్‌సెక్యూరిటీ ఇన్‌ ద వరల్డ్‌ 2015’ ప్రకారం దాదాపు 19.4 కోట్ల మంది భార‌తీయులు ఇంకా తిండి లేక ఆక‌లితో అల‌మ‌టించి పోతున్నార‌ట! ఇక మొత్తంగా ప్రపంచంలో 79.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. 1990-92లో వంద కోట్లు ఉన్న ఆ సంఖ్య 2014-15 కాలానికి దాదాపు 30 శాతం తగ్గిపోయింది. భారత్‌లనూ అది తగ్గినప్పటికీ ఆకలి రాజ్యాల్లో ఇప్ప‌టికీ టాప్‌గా నిలవడం గమనార్హం. ఈ నివేదిక ఆధారంగా 1990-92లో భారత్‌లో సుమారు 21 కోట్ల మందికి పూట గడవడం కష్టంగా ఉండేది. భారత్‌లో ఆకలిదప్పులు గణనీయంగా తగ్గినప్పటికీ… ఆకలి, పేదరిక నిర్మూలనకు సామాజిక కార్యక్రమాలను ఇంకా సమర్థంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. కాగా 90వ దశకంలో ఈ జాబితాలో 28.9 కోట్లమందితో చైనానే అగ్రస్థానంలో ఉన్నా.. దానిని సగానికిపైగా తగ్గించడంలో ఆ దేశం సఫలమైందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశంలో 13.38 కోట్ల మంది ఆకలి మంటలతో అల్లాడుతున్నారు.
First Published:  29 May 2015 6:05 AM GMT
Next Story