Telugu Global
Cinema & Entertainment

 దూసుకొస్తున్న జ్యోతి లక్ష్మి

పెద్దగా అంచనాలు లేని తన ప్రతి సినిమాతో హిట్ అందుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇప్పుడంటే క్రేజ్ వచ్చి స్టార్ అయిపోయాడు కానీ దశాబ్దం కిందట పూరి జగన్నాధ్ సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. అలా అంచనాల్లేకుండా వచ్చిన సినిమాలతోనే సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు పూరి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ లాంటి సినిమాలపై అప్పట్లో పెద్దగా అంచనాల్లేవ్. కానీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలో జ్యోతిలక్ష్మి వస్తోంది. పూరి ఏంటి.. చార్మితో […]

 దూసుకొస్తున్న జ్యోతి లక్ష్మి
X
పెద్దగా అంచనాలు లేని తన ప్రతి సినిమాతో హిట్ అందుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇప్పుడంటే క్రేజ్ వచ్చి స్టార్ అయిపోయాడు కానీ దశాబ్దం కిందట పూరి జగన్నాధ్ సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. అలా అంచనాల్లేకుండా వచ్చిన సినిమాలతోనే సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు పూరి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ లాంటి సినిమాలపై అప్పట్లో పెద్దగా అంచనాల్లేవ్. కానీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలో జ్యోతిలక్ష్మి వస్తోంది. పూరి ఏంటి.. చార్మితో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడమేంటని అంతా అనుకున్నారు.

సరిగ్గా ఇదే పాయింట్ పూరి కొత్త సినిమాకి పబ్లిసిటీ ఎలిమెంట్ గా మారింది. ఎంతోమంది కుర్రహీరోలు సినిమా చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ, పూరి జ్యోతిలక్ష్మి సబ్జెక్ట్ హ్యాండిల్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అందుకే జ్యోతిలక్ష్మి ఇప్పుడు మరింత హాట్ అయింది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూన్ 12న విడుదల చేయాలని నిర్ణయించారు. జూన్ 4న ఆడియోను విడుదల చేస్తారు. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సినిమాలో వన్ ఉమెన్ షో చార్మిదే. కేవలం మెయిన్ లీడ్ చేయడమే కాకుండా.. జ్యోతిలక్ష్మి సినిమాకు సమర్పకురాలిగా కూడా వ్యవహరిస్తోంది చార్మి.

First Published:  29 May 2015 1:38 AM GMT
Next Story