Telugu Global
Cinema & Entertainment

 జూన్ 5న పేరడీ సింగం

సింగం పేరుచెప్పగానే సూర్య గుర్తొస్తాడు ఎవరికైనా. వరుసగా సింగం సీక్వెల్స్ తో హిట్ అందుకున్నాడు ఈ యాక్షన్ హీరో. కానీ ఇప్పుడీ సింగానికే సీక్వెల్ రెడీచేశాడు ఓ కామెడీ హీరో. అతడే మన సంపూర్ణేష్ బాబు. ఇప్పటికే హృదయకాలేయంతో పాపులర్ అయిన ఈ హాస్యనటుడు ఇప్పుడు సింగం123 సినిమాతో హంగామా చేయడానికి సిద్ధమౌతున్నాడు. ఈ సినిమాని జూన్ 5న విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. ట్రయిలర్ కు సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో సినిమా తప్పకుండా […]

 జూన్ 5న పేరడీ సింగం
X
సింగం పేరుచెప్పగానే సూర్య గుర్తొస్తాడు ఎవరికైనా. వరుసగా సింగం సీక్వెల్స్ తో హిట్ అందుకున్నాడు ఈ యాక్షన్ హీరో. కానీ ఇప్పుడీ సింగానికే సీక్వెల్ రెడీచేశాడు ఓ కామెడీ హీరో. అతడే మన సంపూర్ణేష్ బాబు. ఇప్పటికే హృదయకాలేయంతో పాపులర్ అయిన ఈ హాస్యనటుడు ఇప్పుడు సింగం123 సినిమాతో హంగామా చేయడానికి సిద్ధమౌతున్నాడు. ఈ సినిమాని జూన్ 5న విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు.
ట్రయిలర్ కు సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో సినిమా తప్పకుండా హిట్టవుతుందని ఆశపడుతోంది సింగం123 టీం. మరీ ముఖ్యంగా ఈ సినిమా వెనక మంచు ఫ్యామిలీ ఉండడంతో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం జరుగుతోంది. అవును.. సింగం123 సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. కేవలం నిర్మాతగానే కాకుండా.. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే కూడా మంచు విష్ణే. 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ సరంజామాతో తెరకెక్కింది. ఈ సమ్మర్ లో కడుపుబ్బా నవ్వుకోవాలంటే మా సినిమా చూడండంటూ ఇప్పటికే సంపూర్ణేష్, సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాడు.
First Published:  28 May 2015 11:38 PM GMT
Next Story