పోలీస్ గా తాప్సి

పోలీస్ క్యారెక్టర్లు హీరోలే కాదు.. కొంతమంది హీరోయిన్లకు కూడా సూటవుతాయి. ఇప్పటికే పోలీస్ గెటప్ లో విజయశాంతి అదరగొట్టింది. తర్వాత ఆ రేంజ్ లో ఏ హీరోయిన్ కూడా పోలీస్ గెటప్ లో పెద్దగా సూటవ్వలేదు. కానీ అప్పటితరం రమ్యకృష్ణ, సౌందర్య నుంచి నేటితరం నమిత వరకు చాలా మంది పోలీస్ గెటప్పులు వేసినవాళ్లే. ఇప్పుడీ కోవలోకి తాప్సి కూడా చేరింది. తన కొత్త సినిమాలో పోలీస్ గా కనిపించేందుకు సిద్ధమౌతోంది తాప్సి. దీనికోసం ఇప్పట్నుంచే జిమ్ బాట పట్టింది. 
తమిళ్ లో శింబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో తాప్సి హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సికి ఖాకీ గెటప్ ఆఫర్ చేశారు. ఊహించని పాత్ర రావడంతో తొలుత తటపటాయించిన తాప్సి, తర్వాత ఆ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుంది. ప్రస్తుతం జిమ్ లో వర్కవుట్స్ చేస్తోంది. పోలీస్ గెటప్ కోసం కాస్త రఫ్ లుక్ లో కనిపించాలనుకుంటోంది. గమ్మత్తేంటంటే.. ఈ సినిమాలో శింబు కూడా పోలీస్ గానే కనిపిస్తున్నాడు. మరి హీరోహీరోియన్లు ఇద్దరూ పోలీసులు అయినప్పడు సినిమా ఎంత విభిన్నంగా ఉంటుందో అర్థంచేసుకోండి.