జాతీయ‌పార్టీగా తెలుగుదేశం

జాతీయపార్టీగా తెలుగుదేశం ఆవిర్భ‌వించింది. దీనికి సంబంధించిన రాజ‌కీయ తీర్మానాన్ని మ‌హానాడు ఆమోదించింది. టీడీపీ కేంద్ర క‌మిటీ అధ్య‌క్షుడిగా నారా చంద్ర‌బాబునాయుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే ప‌రిమిత‌మైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఇక జాతీయ పార్టీగా ఆవిర్భ‌వించ‌డంతో ద‌క్షిణాది రాష్ట్రాల్లో కూడా పోటీ చేసే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఇపుడు ఈ పార్టీ ఉనికిలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్య‌క్షుల‌ను ఎన్నుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. మ‌హానాడు శుక్ర‌వారంతో ముగుస్తున్నందున ఇక ఆ త‌ర్వాతే వీరి ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది.