Telugu Global
Others

విశాఖలో రూ.330 కోట్లతో టిఎల్‌టి యూనిట్‌

విశాఖపట్నంలో 330 కోట్ల రూపాయల పెట్టుబడితో ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ టవర్స్‌ (టిఎల్‌టి) యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్)- వైజాగ్‌ స్టీల్‌), పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ఇరు కంపెనీలు చెరి సగం భాగస్వామ్యంతో ఆర్‌ఐఎన్‌ఎల్‌- పవర్‌ గ్రిడ్‌ టిఎల్‌టి లిమిటెడ్‌ పేరుతో ఒక జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. గుర్గావ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ సిఎండి పి మధుసూదన్‌, పవర్‌గ్రిడ్‌ సిఎండి ఆర్‌ఎన్‌ నాయక్‌ సమక్షంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ […]

విశాఖపట్నంలో 330 కోట్ల రూపాయల పెట్టుబడితో ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ టవర్స్‌ (టిఎల్‌టి) యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్)- వైజాగ్‌ స్టీల్‌), పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ఇరు కంపెనీలు చెరి సగం భాగస్వామ్యంతో ఆర్‌ఐఎన్‌ఎల్‌- పవర్‌ గ్రిడ్‌ టిఎల్‌టి లిమిటెడ్‌ పేరుతో ఒక జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. గుర్గావ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ సిఎండి పి మధుసూదన్‌, పవర్‌గ్రిడ్‌ సిఎండి ఆర్‌ఎన్‌ నాయక్‌ సమక్షంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ జిఎం (టెక్నాలజీ) విల్సన్‌ డేవిడ్‌, పవర్‌గ్రిడ్‌ జిఎం అఖిల్‌ కుమార్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.
First Published:  28 May 2015 1:08 PM GMT
Next Story