ఈ వారం  హిట్ హీరో ఎవ‌రో..! 

ఈ శుక్ర‌వారం  రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.  ఒక‌టి  మ‌న తెలుగు యువ హీరో రామ్  న‌టించిన పండ‌గ చేస్కో చిత్రం. మ‌రొక‌టి  త‌మిళ హీరో సూర్య న‌టించిన  రాక్ష‌సుడు చిత్రం  త‌మిళ్ తో  పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.  ఇద్ద‌రు హీరోల‌కు  హిట్ హండ్రెట్ ప‌ర్సెంట్ అవ‌స‌ర‌మైన సంద‌ర్భం ఇది.  రామ్ కు  మంచి హిట్  లేక చాల కాలం అయ్యింది.  అలాగే సూర్య కూడా గ‌జ‌నీ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ఇంత వ‌ర‌కు  స‌రైన హిట్ అల్లలాడి పోతున్నాడు.  
మ‌రి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఈ వారం ప్రేక్ష‌కులు  మ‌న‌సు గెలుచుకుంటారో  అనేది  తెలియాలంటే  ఆదివారం వ‌ర‌కు  వెయిట్ చేయాల్సిందే. క‌నీసం రిలీజైన మూడు రోజుల త‌రువాత గానీ.. సినిమాలో అస‌లు విష‌యం వుందా లేదా అనేది  క్లారీటి వ‌స్తుంది.  స్టార్ హీరో చిత్రాల‌కు మొద‌టి రెండు  , మూడురోజులు  ఫ్యాన్స్ ఎక్కువుగా చూస్తుంటారు కాబ‌ట్టి..  వాళ్లు మ్యాగ్జిమ‌మ్ పాజిటివ్ ఫీల్ జ‌న‌రేట్ చేస్తారు. అస‌లు టాక్ రావాలంటే  నాలుగో రోజు నుంచి వ‌చ్చేది ఫైన‌ల్ టాక్  గా భావించాలి మ‌రి.