Telugu Global
Others

టీఆర్ఎస్‌లో చేరేందుకు ఎర్ర‌బెల్లి య‌త్నం: క‌డియం

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ లోకి రాకుండా అడ్డుకున్నది తానేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరాలనుకున్న మాట వాస్తవమే అన్నారు. ఎర్రబెల్లిలాంటి తెలంగాణ ద్రోహులకు టీఆర్ ఎస్ పార్టీలో ఎప్పటికీ స్థానం ఉండదని కడియం అన్నారు. టీఆర్ఎస్ ను విమర్శించే అర్హత ఎర్రబెల్లికి లేదన్నారు. నీచమైన భాషతో దిగజారుడు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నీచ రాజకీయాలు మానుకోవాలని శ్రీహరి అన్నారు. ఎర్రబెల్లిపై కడియం నిప్పులు […]

టీఆర్ఎస్‌లో చేరేందుకు ఎర్ర‌బెల్లి య‌త్నం: క‌డియం
X
టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ లోకి రాకుండా అడ్డుకున్నది తానేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరాలనుకున్న మాట వాస్తవమే అన్నారు. ఎర్రబెల్లిలాంటి తెలంగాణ ద్రోహులకు టీఆర్ ఎస్ పార్టీలో ఎప్పటికీ స్థానం ఉండదని కడియం అన్నారు. టీఆర్ఎస్ ను విమర్శించే అర్హత ఎర్రబెల్లికి లేదన్నారు. నీచమైన భాషతో దిగజారుడు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నీచ రాజకీయాలు మానుకోవాలని శ్రీహరి అన్నారు. ఎర్రబెల్లిపై కడియం నిప్పులు చెరిగారు. ‘నేను తెలంగాణ ఊసెత్తలేదని విమర్శించావు.. టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ తీర్మానం చేయించింది.. రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాల్కల ధోరణి వద్దని చంద్రబాబుకు తాను చెప్పింది వాస్తవం కాదా, దీనికి నీవు ప్రత్యక్ష సాక్షివి కాదా’ అని ఎర్రబెల్లిని ప్రశ్నించారు.
First Published:  29 May 2015 9:53 PM GMT
Next Story