Telugu Global
Cinema & Entertainment

అమితాబ్ ను ఏడిపించింది..! 

ఇదేంటో  కంగ‌న ర‌నౌత్  ఈ మ‌ధ్య  ఎప్పుడు క‌న్నీరు పెట్ట‌ని    అమితాబ‌చ్చ‌న్ ను  ఏడిపించేసింది. ఇలా ఎందుకు  జ‌రిగింది. ఎక్క‌డ జ‌రిగింది.  ఎలా జ‌రిగింది అనేగా మీ సందేహాం.  న‌టిగా   కంగ‌న  గ‌త  యేడాది క్వీన్ చిత్రంతో   దుమ్ము దులిపిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో  త‌న న‌ట‌న‌కు  జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు కూడా త‌న ఖాతాలో వేసుకుంది.ఇక  మూడు సంవ‌త్స‌రాల క్రితం  బాలీవుడ్ లో  మాధ‌వ‌న్ , కంగ‌న  లీడ్ […]

అమితాబ్ ను ఏడిపించింది..! 
X
ఇదేంటో కంగ‌న ర‌నౌత్ ఈ మ‌ధ్య ఎప్పుడు క‌న్నీరు పెట్ట‌ని అమితాబ‌చ్చ‌న్ ను ఏడిపించేసింది. ఇలా ఎందుకు జ‌రిగింది. ఎక్క‌డ జ‌రిగింది. ఎలా జ‌రిగింది అనేగా మీ సందేహాం. న‌టిగా కంగ‌న గ‌త యేడాది క్వీన్ చిత్రంతో దుమ్ము దులిపిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు కూడా త‌న ఖాతాలో వేసుకుంది.ఇక మూడు సంవ‌త్స‌రాల క్రితం బాలీవుడ్ లో మాధ‌వ‌న్ , కంగ‌న లీడ్ రోల్స్ లో వ‌చ్చిన తను వెడ్స్ మ‌ను చిత్రం ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో తెలిసిందే.

ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ వ‌చ్చింది. ఈచిత్రంలో ఈ హార్యానా బ్యూటీ రెండు రోల్స్ చేసింది. ఒక పాత్ర పేరు త‌ను మ‌రో పాత్ర పేరు ద‌త్తో .. ఈ రెండు రోల్స్ లో కంగ‌న న‌ట‌న అమితాబ్ కు అమితానందం ..భావోద్వేగం తెప్పించి సంతోషంతో కంట తడి తెప్పించాయ‌ట‌. దీంతో కంగ‌న కు రెండు అభినంద‌న పుష్ప గుచ్చాలు.. రెండు ప్ర‌శంస లేఖ‌లు పంపించార‌ట‌. ఆ రెండు లేఖ‌ల్ని ఫ్రెమ్స్ క‌ట్టించి ఇంట్లో పెట్టుకుంద‌ట‌. అమితాబ్ గారు ఇచ్చిన ఆ ప్ర‌శంస‌లు నాకు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అని కితాబు ఇచ్చుకుంది .

First Published:  30 May 2015 2:17 AM GMT
Next Story