Telugu Global
International

జపాన్‌ను వణికించిన భూకంపం

జ‌పాన్ ప్ర‌జ‌లు ఓనిమ‌షం పాటు భ‌యంతో వ‌ణికిపోయారు. శ‌నివారం ఉద‌యం ఒక్క నిమ‌షంపాటు వ‌చ్చిన భూ ప్ర‌కంప‌న‌లు వారిని మృత్యువు ద‌గ్గ‌ర‌కు తీసుకుపోయాయి.  భవనాలు ఊగటంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్ట‌ర్ స్కేలుపై ఈ భూకంప తీవ్ర‌త 7.8గా న‌మోదైంది. ఇటీవ‌ల నేపాల్‌లో వ‌చ్చిన భూకంప తీవ్ర‌త క‌న్నా ఇది ఎక్కువ‌. అయితే ఏమాత్రం ప్రాణ న‌ష్టం లేకుండా ఈ భూకంపం భ‌య‌పెట్టి వ‌దిలేసింది. అయితే.. సునామీ ప్రమాదమేమీ లేదని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక నిమిషంపాటు […]

జపాన్‌ను వణికించిన భూకంపం
X
జ‌పాన్ ప్ర‌జ‌లు ఓనిమ‌షం పాటు భ‌యంతో వ‌ణికిపోయారు. శ‌నివారం ఉద‌యం ఒక్క నిమ‌షంపాటు వ‌చ్చిన భూ ప్ర‌కంప‌న‌లు వారిని మృత్యువు ద‌గ్గ‌ర‌కు తీసుకుపోయాయి. భవనాలు ఊగటంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్ట‌ర్ స్కేలుపై ఈ భూకంప తీవ్ర‌త 7.8గా న‌మోదైంది. ఇటీవ‌ల నేపాల్‌లో వ‌చ్చిన భూకంప తీవ్ర‌త క‌న్నా ఇది ఎక్కువ‌. అయితే ఏమాత్రం ప్రాణ న‌ష్టం లేకుండా ఈ భూకంపం భ‌య‌పెట్టి వ‌దిలేసింది. అయితే.. సునామీ ప్రమాదమేమీ లేదని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఒక నిమిషంపాటు ఇంత తీవ్రతతో భూకంపం వచ్చినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దక్షిణ జపాన్‌కు 870 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 670 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రమాదం జరగొచ్చన్న అంచనాతో.. టోక్యోలోని నరితా అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రన్‌వేలను మూసేసారు. రైల్వే వ్యవస్థను కూడా కాసేపు ఆసేసి.. ఆ తర్వాత ప్రారంభించారు. 2011మార్చిలో జపాన్‌లో వచ్చిన భూకంపం సృష్టించిన విధ్వంసం.. మిగిల్చిన ప్రాణ నష్టం ఇంకా కళ్ల ముందు మెదలుతోంది.

దీన్ని దృష్టిలో పెట్టుకునే.. చిన్న కంపానికి కూడా జపనీయులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. మ‌రోవైపు… జపాన్‌ దక్షిణ భాగంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. ఇది లావాను వెదజల్లుతుండటంతో స్థానికులను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు, జపాన్‌ భూకంపం ప్రభావం ఢిల్లీలోనూ కనిపించింది. శనివారం సాయంత్రం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించటంతో.. జనాలు భ‌యంతో అపార్ట్‌మెంట్ల్ల్లలోనుంచి బయటకు వచ్చారు.

First Published:  31 May 2015 1:58 AM GMT
Next Story