ముఖవర్ఛస్సు పెంచే జ్యూసులు

మన ముఖం అందంగా, ఆకర్షణీయంగా, తేజోమయంగా ప్రకాశించేందుకు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగనక్కరలేదు. బోలెడంత డబ్బు ఖర్చు చేయనక్కరలేదు. మనకు అందుబాటులో ఉండే పదార్ధాలతో ముఖ వర్ఛస్సు పెంచుకోవచ్చని నిపుణులంటున్నారు.  కొన్ని రకాల జ్యూసులతోమన ముఖంలో ‘గ్లో’ని పెంచవచ్చని వారు వివరిస్తున్నారు. అవేమిటో చూద్దాం… నాలుగు టొమాటోలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కూడా. రోజూ ఒక కప్పు యాపిల్ జ్యూస్ తీసుకున్నా ఆరోగ్యం మెరుగుపడడమే కాక చర్మం నిగారింపు పెరుగుతుంది. క్యారెట్ జ్యూస్ వల్ల ముఖానికి తేజస్సు నివ్వడమే కాక కళ్లకూ మేలు చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. పైగా ఇది లివర్‌కు మంచిది. కిడ్నీలను కూడా శుద్ధి చేస్తుంది. రక్తంలోని మలినాలన్నీ పోతాయి. ఎర్రరక్త కణాలు పెరుగుతాయి.