Telugu Global
Others

వ‌డ‌దెబ్బ మృతుల‌కు ప్ర‌ధాని సంతాపం

వ‌డ దెబ్బ‌కు మృతి చెందిన వారికి ప్ర‌గాఢ సానుభూతి తెల‌ప‌డానికి… ఇటీవ‌ల ప‌రీక్ష‌ల్లో అద్భుత విజ‌యాలు సాధించిన విద్యార్థుల‌ను అభినందించ‌డానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి  ‘మన కీ బాత్‌’ (మనసులో మాట) కార్యక్రమాన్ని చ‌క్క‌గా ఉపయోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ఉదయం 11 గంటలకు  దేశ ప్రజలను ఉద్దేశించి ఆల్‌ ఇండియా రేడియో ద్వారా మనసులో మాటని చెప్పారు. ముందుగా ఆయన దేశ వ్యాప్తంగా వడదెబ్బ వల్ల మృతిచెందిన వారికి సంతాపం ప్ర‌క‌టిస్తూ… ఎండల్లో బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు […]

వ‌డ‌దెబ్బ మృతుల‌కు ప్ర‌ధాని సంతాపం
X
వ‌డ దెబ్బ‌కు మృతి చెందిన వారికి ప్ర‌గాఢ సానుభూతి తెల‌ప‌డానికి… ఇటీవ‌ల ప‌రీక్ష‌ల్లో అద్భుత విజ‌యాలు సాధించిన విద్యార్థుల‌ను అభినందించ‌డానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి ‘మన కీ బాత్‌’ (మనసులో మాట) కార్యక్రమాన్ని చ‌క్క‌గా ఉపయోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ఉదయం 11 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ఆల్‌ ఇండియా రేడియో ద్వారా మనసులో మాటని చెప్పారు. ముందుగా ఆయన దేశ వ్యాప్తంగా వడదెబ్బ వల్ల మృతిచెందిన వారికి సంతాపం ప్ర‌క‌టిస్తూ… ఎండల్లో బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే తప్ప ఎండలో తిరగవద్దని ఆయన సూచించారు. త‌ర్వాత వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మోడీ అభినందనలు తెలియజేశారు. అలాగే అపజయాన్ని చూసి కుంగిపోవ‌ద్ద‌ని… విజ‌యానికి మ‌రింత చేరువ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. దేశ సేవ గురించి విద్యార్థులు ఆలోచించాలని సూచించారు. ఎన్డీయే ప్రభుత్వం అనేక కీలక పథకాలను ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఉత్తమ పాలన కోసం సలహాలను తీసుకుంటామని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కట్టుబడి పనిచేస్తున్నామని మోడీ తెలిపారు. మా ప్రభత్వం విమర్శలు, ప్రశంసలు ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. మాజీ సైనిక ఉద్యోగులకు వర్తించే వన్‌ ర్యాంక్‌- వన్‌ పెన్షన్‌ పథకంపై తమ ప్రభుత్వం తొందరపడి నిర్ణయం తీసుకోదని ప్రధాని మోడీ తెలిపారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పథకాన్ని పట్టించుకోలేదని మోడీ విమర్శించారు. సమాన పెన్షన్‌ పథకాన్ని ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా అమలు చేయాలని భావిస్తున్నందనే ఆలస్యం జరుగుతోందని ఆయన వివరించారు. సైనిక సోదరులను పాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు.
First Published:  31 May 2015 5:32 AM GMT
Next Story