Telugu Global
NEWS

టీ-టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అరెస్ట్‌!

తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డిని అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు రేవంత్‌ రెడ్డిని, స్టీఫెన్‌ను ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. కేసుకు సంబంధించి అధికారులు ఇరువురినీ విచారిస్తున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కి రూ. 50 లక్షలు ఎరగా ఇవ్వ‌ చూపారని ఆరోపణలు వ‌చ్చిన నేప‌థ్యంలో రేవంత్‌ను అరెస్ట్ చేసిన‌ట్టు చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ట్రాప్‌ చేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌ను […]

టీ-టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అరెస్ట్‌!
X

తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డిని అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు రేవంత్‌ రెడ్డిని, స్టీఫెన్‌ను ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. కేసుకు సంబంధించి అధికారులు ఇరువురినీ విచారిస్తున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కి రూ. 50 లక్షలు ఎరగా ఇవ్వ‌ చూపారని ఆరోపణలు వ‌చ్చిన నేప‌థ్యంలో రేవంత్‌ను అరెస్ట్ చేసిన‌ట్టు చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ట్రాప్‌ చేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. త‌న వ‌ద్ద డ‌బ్బులేమీ దొర‌క‌లేద‌ని, ఇదంతా కావాల‌ని కొంత‌మంది త‌నపై క‌క్ష‌తో దురుద్దేశ్య‌పూర్వ‌కంగా చేస్తున్నార‌ని, ఇది కేసీఆర్ కుట్ర అని రేవంత్ రెడ్డి ఫోన్‌లో మీడియాకు తెలిపారు. స్టీఫెన్‌స‌న్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగానే ఎసీబీ రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన‌ట్టు చెబుతున్నారు. రేవంత్‌ను పథకం ప్రకారమే అరెస్ట్‌ చేశారని టీ-టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెనే రేవంత్‌ దగ్గరకు వెళ్లారని అన్నారు. రేవంత్‌ అరెస్ట్‌ రాజకీయ కుట్ర అని, కేసీఆర్‌ కక్షసాధింపుతో ఇదంతా చేస్తున్నార‌ని ఆయ‌న మండిపడ్డారు. ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌పై టిటిడిపి నేతలు డీజీపీ అనురాగ్‌ శర్మను కలిశారు. రేవంత్‌ అరెస్ట్‌ అక్రమమని, అరెస్ట్‌కు సంబంధించి వివరాలను అధికారికంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేత రెవంత్‌ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు చేపట్టనుంది. కేసీఆర్‌, ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. రెవంత్‌ అక్రమ అరెస్ట్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది.
తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు
ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న రేవంత్‌ లాయర్లు… అనుమతించని ఏసీబీ అధికారులు
లీగల్‌ కౌన్సిల్‌ను కార్యాలయంలోకి అనుమతించకపోవడం చట్టవిరుద్ధమని రేవంత్‌ తరఫు న్యాయవాదులు అసహనం వ్యక్తం చేశారు. రేవంత్‌ అరెస్ట్‌పై సమాచారం అందుకున్న ఆయన వ్యక్తిగత న్యాయవాదులు వెంటనే ఏబీసీ కార్యాలయానికి వచ్చారు. రేవంత్‌ను కలిసేందుకు అనుమతివ్వాల్సిందిగా పోలీసు అధికారులను కోరగా లోనికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తమకు అనుమతి నిరాకరించడాన్ని చట్టం అంగీకరించదని న్యాయవాదులు పేర్కొన్నారు. అరెస్ట్‌కు ముందు కుటుంబ సభ్యులకు, తమకు తెలియజేయాలని నిబంధన ఉందని గుర్తుచేశారు. ఈ అంశాన్ని కోర్టులే పరిష్కరిస్తాయని అన్నారు.
చంద్ర‌బాబుకు ఇలాంటి క‌థ‌లకు డైరెక్ష‌న్ అల‌వాటే: క‌డియం
ఇదిలావుండ‌గా రేవంత్ అరెస్ట్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి స్పందిస్తూ తెలుగుదేశం పార్టీకి ఇలాంటివి చేయ‌డం అల‌వాటేన‌ని, తాము ఐదో స్థానాన్ని ద‌క్కించుకోకుండా చేయ‌డం కోసం చంద్ర‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో రేవంత్ ఈ క‌థ న‌డిపిస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో ఇలాంటి ప‌నులు చేయ‌డం మానుకోవాల‌ని ఆయ‌న అన్నారు. స్టీఫెన్‌స‌న్‌కు ఐదు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఇవ్వ‌డానికి ఒప్పందం కుదుర్చుకున్నార‌ని, అందులో భాగంగానే ఈరోజు 50 ల‌క్ష‌లు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే త‌న‌కు మీడియా వార్త‌ల ఆధారంగానే స‌మాచారం తెలిసింద‌ని, ఇంకా వాస్త‌వాలు తెలియ‌ద‌ని, రేవంత్ మాత్రం డ‌బ్బుతో ప‌ట్టుబ‌డ్డ‌ట్టు మీడియాలో చూశాన‌ని ఆయ‌న అన్నారు. రేవంత్ ప‌ట్టుబ‌డ‌డం వెనుక ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు హ‌స్తం ఉండి ఉండ‌వ‌చ్చ‌ని, రేవంత్ మీద కోపంతోఆయ‌నే ఏసీబీకి తెలియ‌జేసి ఉండొచ్చ‌ని ఆయ‌న ఆరోపించారు.

First Published:  31 May 2015 12:15 PM GMT
Next Story