Telugu Global
Cinema & Entertainment

  టాక్సీ డ్రైవర్ గా శృతిహాసన్

ఎప్పుడు రొటీన్ హీరోయిన్ పాత్రలు చేసే శృతిహాసన్ చెంతకు ఓ అరుదైన, బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. అదే టాక్సీ డ్రైవర్ పాత్ర. కోల్ కతాలో టాక్స్ నడిపే అమ్మాయి పాత్రను శృతికి ఆఫర్ చేశాడు దర్శకుడు శివ. క్యారెక్టర్ అద్భుతంగా ఉండడంతో పాటు.. ఆ సినిమాలో హీరో అజిత్ కూడా కావడంతో ఏమాత్రం అడ్డుచెప్పలేకపోయింది శృతిహాసన్. వెంటనే ఓకే చెప్పేసింది. అంతేకాదు.. ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోకూడదనే ఉద్దేశంతో వెంటనే కాల్షీట్లు ఎడ్జస్ట్ చేసింది. కాస్త రెమ్యునరేషన్ […]

  టాక్సీ డ్రైవర్ గా శృతిహాసన్
X
ఎప్పుడు రొటీన్ హీరోయిన్ పాత్రలు చేసే శృతిహాసన్ చెంతకు ఓ అరుదైన, బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. అదే టాక్సీ డ్రైవర్ పాత్ర. కోల్ కతాలో టాక్స్ నడిపే అమ్మాయి పాత్రను శృతికి ఆఫర్ చేశాడు దర్శకుడు శివ. క్యారెక్టర్ అద్భుతంగా ఉండడంతో పాటు.. ఆ సినిమాలో హీరో అజిత్ కూడా కావడంతో ఏమాత్రం అడ్డుచెప్పలేకపోయింది శృతిహాసన్. వెంటనే ఓకే చెప్పేసింది.

అంతేకాదు.. ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోకూడదనే ఉద్దేశంతో వెంటనే కాల్షీట్లు ఎడ్జస్ట్ చేసింది. కాస్త రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. చెన్నైలో అజిత్, మరో హీరోయిన్ లక్ష్మీమీనన్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. శృతిహాసన్ అంగీకరించింది కాబట్టి.. త్వరలోనే ఆమెతో కోల్ కతాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో అజిత్ పాల్గొంటాడా లేదా అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. టాక్సీ డ్రైవర్ కాబట్టి శృతిహాసన్ మాత్రం సినిమాలో చాలా చోట్ల ఖాకీ డ్రెస్ లో కనిపించబోతోంది.

First Published:  31 May 2015 1:31 AM GMT
Next Story